Etela Rajender: హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కింది. ఎండా కాలం కాకపోయినా సెగలు కక్కుతోంది. పార్టీల మధ్య ఆరోపణలతో పాటు కేసుల వరకు వెళుతోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఈటల చేసిన ఆరోపణలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య రచ్చ సాగుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికపై రెండు పార్టీల్లో మరింత రగడ రేగుతోంది. విజయం సాధించే క్రమంలో పలు దురుద్దేశాలతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే వరకు వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీని ఇరికించి వారిని అపజయం పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా ఎంత ఆరోపణలు చేసుకున్నా ఫిర్యాదుల వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రమైనట్లు సమాచారం.
అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తమ శక్తియుక్తులు ప్రదర్శిస్తూ గెలుపు ముంగిట నిలవాలని చూస్తున్నారు. ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. కావాలనే రెచ్చగొడుతూ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల ముంగిట పలుచన అయిపోతున్నారు. అయినదానికి కాని దానికి దుష్ర్పచారం చేస్తూ దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: TPCC Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చిందా?
ఈనెల 30న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీలు తమ స్థాయిని మరిచిపోతున్నాయి. హుందాగా రాజకీయం చేయాల్సిన పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎదుటి పార్టీని ఇరుకున పెట్టేందుకే ప్రాధాన్యం ఇష్తున్నాయి. ఆరోపణలకు సైతం ఫిర్యాదులు చేసేందుకు వెనుకాడటం లేదు. దీంతో ప్రజల్లో వారికి మైనస్ మార్కులే పడుతాయని తెలిసినా వారి నైజాన్ని బయటపెట్టుకునేందుకు తాపత్రయ పడుతున్నాయని తెలుస్తోంది.
Also Read: Dussehra 2021: దసరా వచ్చిందయ్యా…