TRS vs BJP: భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కు అసలు పొసగడం లేదు. రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయి. ధాన్యం కొనుగోలు అంశాన్ని సాకుగా చూపుతూ బీజేపీని ఎండగట్టాలని బావిస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ చావు డప్పు పేరుతో రాష్ర్టవ్యాప్తంగా నిరసన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలందరూ బీజేపీ విధానాన్ని తప్పు బడుతూ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో రాష్ర్టంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తోంది. దీని కోసమే టీఆర్ఎస్ అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.
రాష్ర్టంలో బీజేపీ మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే, ఎంపీ స్తానాలు గెలుచుకుంటూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతోంది. దీంతో కడుపు మండిన టీఆర్ఎస్ ఎలాగైనా బీజేపీని రాష్ర్టంలో నిలదొక్కుకోకుండా చేయాలనే తలంపుతోనే ఇలా రాద్దాంతం చేస్తూ బజారులో ఏకాకిని చేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దక్షిణాది స్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణలో మూడు ఎమ్మెల్యే నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. దీంతో టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎధిగేలా ఉందని భావించి దాన్ని ఇక్కడ పురుడుపోసుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు రేవంత్ అడుగులు.. సాధ్యమయ్యేనా?
దీంతోనే బీజేపీని నిందిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసింది. ధాన్యం కొనుగోలును సాకుగా చూపుతూ కేంద్రంపై విమర్శలకు దిగుతోంది. అయినా బీజేపీ ప్రతిష్టను ఎవరు మసకబార్చలేరని తెలిసినా టీఆర్ఎస్ మాత్రం తన వంతుగా ఆందోళనలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.