https://oktelugu.com/

TRS complaint to Sonia Gandhi: రేవంత్ పై సోనియాకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు ట్విస్ట్ ఏంటంటే?

TRS complaint to Sonia Gandhi: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక నేతల్లో జోష్ పెరిగింది. పార్టీ మనుగడపై అంచనాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రేవంత్ విమర్శలు చేస్తుండడంతో కాంగ్రెస్ నేతల్లో నూతనోత్తేజం వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ ను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుకు బెదిరిపోయి ఏఐసీసీ సోనియాగాంధీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2021 / 05:44 PM IST
    Follow us on

    TRS complaint to Sonia Gandhi: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక నేతల్లో జోష్ పెరిగింది. పార్టీ మనుగడపై అంచనాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రేవంత్ విమర్శలు చేస్తుండడంతో కాంగ్రెస్ నేతల్లో నూతనోత్తేజం వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ ను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుకు బెదిరిపోయి ఏఐసీసీ సోనియాగాంధీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో రేవంత్ రెడ్డి బలమేమిటో అర్థం అవుతోంది.

    ఎదుటివారిని మాటలతో తిట్టడంలో కేసీఆర్ ను మించిన వారు ఎవరు లేరు. అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నేతలను కేసీఆర్ నోటికొచ్చినట్లు తిట్టారు. అధికారంలోకి రాగానే ప్రత్యర్థులను తిడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని రేవంత్ రెచ్చిపోతున్నారు. దీంతో భరించలేని టీఆర్ఎస్ నేతలు రేవంత్ ను బలిపశువును చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. కారణాలేవైనా కేసీఆర్ పై విమర్శలు చేసే నేతలు కాంగ్రెస్ లో తక్కువే అని చెప్పాలి. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. దీంతో ఆయన రేవంత్ రెడ్డి ఆరోపణలపై అప్రమత్తం అవుతున్నారు. రాజకీయాల్లో మాటలతోనే యుద్ధం చేసుకునే నేతలు ప్రస్తుతం తమ నోళ్లకు పని చెబుతున్నారు.

    తెలంగాణ ప్రకటించడంలో కాంగ్రెస్ పాత్ర ఉన్నా ఫలితం మాత్రం కేసీఆర్ కే దక్కింది. నోముకున్నోడి బూరె నోచుకున్నోడు తిన్నట్లు చేసిందొకరు ఫలితం అనుభవించేది మరొకరని సోనియాగాంధీకి కూడా కేసీఆర్ పై ద్వేషం ఉందని తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి తన పదునైన వాగ్బాణాలతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడంతో మనసులోనే సోనియా సంతోషపడిపోతున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి తనదైన దూకుడుతో సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్ఎస్ పై తన మాటలతో ఇరుకున పెట్టే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి దెబ్బకు టీఆర్ఎస్ కుదేలైపోతోందని చెబుతున్నారు.