R.Narayana Murthy’s Love Story: పెళ్లెందుకు చేసుకోలేదంటే.. ఆర్.నారాయణ మూర్తి ‘లవ్ ఫెయిల్యూర్’ కథ

  R.Narayana Murthy’s Love Story: ఆర్ . నారాయణ మూర్తి (R.Narayana Moorthy).. తెలుగు చిత్రసీమలో స్వతహాగా ఎదిగిన ఒక పీపుల్స్ స్టార్. విప్లవ సినిమాలు తీసి ప్రజల్లో కనువిప్పు కలిగించిన హీరో. ప్రతీ హీరో అంతో ఇంతో సంపాదించుకున్నా.. నారాయణ మూర్తి మాత్రం నమ్మిన ఆశయాల కోసం ఇప్పటికీ ఆటోల్లో తిరుగుతూ ఏమీ సంపాదించుకోని హీరోగా మిగిలిపోయాడు. అందుకే తెలుగు చిత్ర సీమలో అత్యంత ప్రశంసలు పొందిన నటులలో ఒకరుగా ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు. […]

Written By: NARESH, Updated On : August 29, 2021 5:25 pm
Follow us on

 

R.Narayana Murthy’s Love Story: ఆర్ . నారాయణ మూర్తి (R.Narayana Moorthy).. తెలుగు చిత్రసీమలో స్వతహాగా ఎదిగిన ఒక పీపుల్స్ స్టార్. విప్లవ సినిమాలు తీసి ప్రజల్లో కనువిప్పు కలిగించిన హీరో. ప్రతీ హీరో అంతో ఇంతో సంపాదించుకున్నా.. నారాయణ మూర్తి మాత్రం నమ్మిన ఆశయాల కోసం ఇప్పటికీ ఆటోల్లో తిరుగుతూ ఏమీ సంపాదించుకోని హీరోగా మిగిలిపోయాడు. అందుకే తెలుగు చిత్ర సీమలో అత్యంత ప్రశంసలు పొందిన నటులలో ఒకరుగా ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు.

ఇప్పటికే నారాయణ మూర్తి వామపక్ష భావజాలం ఉన్న చిత్రాలను రూపొందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పెళ్లాం, పిల్లలు అంటూ ఏం లేకుండా దీనికే అంకితమయ్యారు. పెళ్లికి దూరంగా ఉన్నారు. నారాయణమూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదన్నది ఇప్పటికీ హాట్ టాపిక్. నారాయణ మూర్తి వివాహం చేసుకోకపోవడానికి గల కారణాలను తాజాగా ఆయన పంచుకున్నాడు.

ఆర్ నారాయణ మూర్తి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘నేను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. నా తల్లిదండ్రులకు కుల పట్టింపులు ఎక్కువ. అట్టడుగు కులస్థుడిని కౌగిలించుకున్నందుకు మా నాన్న నన్నురోజంతా కొట్టాడు. నేను సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఒక మహిళతో ప్రేమలో పడ్డాను. నా తల్లిదండ్రులకు కూడా ఆమెను చేసుకుంటానని చెప్పాను. అయితే వారు ఆమె వేరే కులానికి చెందింది కాబట్టి నా పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నాకు జీవితంపై విరక్తి పుట్టింది. ఆ తర్వాత నేను ఎవరినీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అందువల్ల నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని సంచలన నిజాలు పంచుకున్నారు.

అయితే ప్రస్తుతం వయసు మీదపడింది. వృద్ధాప్యం వస్తోంది. ఇటువంటి సమయంలో మనకు తోడుగా ఒక భాగస్వామి ఉంటేనే జీవితం బాగుంటుంది. పెళ్లి చేసుకోకపోవడంతో ఇప్పుడు ఆ శూన్యతను నేను అనుభవిస్తున్నాను..కాబట్టి యువకులందరూ సరైన వయసులో వివాహం చేసుకోవాలని నేను సూచిస్తున్నాను. లేకపోతే తరువాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.