KTR: మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీ నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది. ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట గులాబీ లీడర్లు.. నియోజకవర్గంలో కష్టపడి పని చేసేది మేము అయితే ఆ క్రెడిట్‌ను ప్రతిపక్ష పార్టీ ఖాతాలో వేయడం ఏంటిని ఫైర్ అవుతున్నారు. ఈ వియషంపై తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధం అవుతున్నారట.. బావమరిది తమకు అన్యాయం చేశాడని, అందుకే బావ దగ్గరకు వెళ్లేందుకు ఆ నేతలు సిద్ధంగా ఉన్నారట.. మంత్రి కేటీఆర్ అలా ఎందుకు ప్రవర్తించారో క్లారిటీ ఇచ్చాకే పార్టీ కోసం పనిచేస్తామని గట్టిగా చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. సొంత పార్టీ లీడర్లే కేటీఆర్ పై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రత్యర్థి పార్టీ నేతతో దోస్తీయా..
మంత్రి కేటీఆర్ ఇటీవల సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ది కార్యకలాపాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు లాభం చేకూర్చలే మంత్రి కేటీఆర్ చేష్టలు ఉన్నాయని మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. అంతేకాకుండా తనను జగ్గారెడ్డితో కలిసి పని చేయాలని కేటీఆర్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కేటాయిస్తే.. జగ్గారెడ్డి అసెంబ్లీలో కోరడం వల్లే మెడికల్ కాలేజీ ఇచ్చామని.. ఇచ్చిన కేసీఆర్ ఘనతను గుర్తించకుండా ఆ క్రెడిట్‌ను మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి ఖాతాలో వేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సంగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.
Also Read: కేంద్రంపై ఇలా ఫైట్ మొదలెట్టిన కేటీఆర్
అధిష్టానం వద్ద తేల్చుకోవాలని..
మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో పార్టీకి చేసిస డ్యామేజ్ విషయంలో అధిష్టానం వద్ద తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యేతో పాటు గులాబీ లీడర్లు ఆలోచిస్తున్నారని తెలిసింది. కేటీఆర్ వ్యాఖ్యలతో తాము ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలను తమతో కాకుండా ఎమ్మెల్యే జగ్గారెడ్డితో శంకుస్థాపన చేయించడం స్థానిక టీఆర్ఎస్ లీడర్లకు రుచించడం లేదని తెలిసింది. ఈక్రమంలోనే రెండ్రోజుల కింద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖరికి నిలదీస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ‘చావు డప్పు’ కార్యక్రమం చేపట్టింది. అయితే, జిల్లా మొత్తం ఈ కార్యక్రమం జరిగినా సంగారెడ్డి టీఆర్ఎస్ లీడర్లు మాత్రం దూరంగా ఉన్నారు. కేటీఆర్ చేసిన డ్యామేజ్ వలన అలిగిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసింది. అయితే, తనకు ఆరోగ్యం బాలేదని అందుకే చావు డప్పు కార్యక్రమంలో పాల్గొనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారట..
మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో ప్రత్యర్థి పార్టీ నేత జగ్గారెడ్డితో కలిసి రాసుకుని పూసుకుని తిరగడంపై మంత్రి హరీశ్ రావును కలవాలని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అండ్ కో భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ జగ్గారెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం అయితే తమ సంగతి ఏంటని కూడా గట్టిగా నిలదీయాలని అనుకుంటున్నారట.. ఈ విషయంపై సరైన క్లారిటీ వచ్చాక పార్టీలో ఉండాలా? లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సంగారెడ్డి గులాబీ నేతలు చెబుతున్నారు. చివరగా తమ పార్టీ నేతలను బాగా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డికి చెప్పడాన్ని బట్టి జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారా? అనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ రేవంత్ వర్గం, ఆ పార్టీ సీనియర్లు మరో వర్గంగా చీలిపోయిన విషయం తెలిసిందే. అక్కడ జగ్గారెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా? అని కూడా నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read: జగన్ , కేసీఆర్ లకు గొప్ప ఇబ్బందే వచ్చిందే?