TRS Leader Distributes Liquor Bottles: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అధికారంలో ఉన్న వారికి డబ్బులకు లెక్క ఉండదు. ఖర్చు విపరీతంగా చేస్తుంటారు. అక్రమంగా సంపాదిస్తుంటారు. దీనికి నిలువెత్తు నిదర్శనాలు చాలా ఉన్నాయి. తాజాగా వరంగల్ లో ఓ నేత కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న సందర్భంలో తనకు కలిగిన ఉత్సాహం, ఉల్లాసంతో అందరికి మందు, మాంసం పంపిణీ చేసి ఆశ్చర్యపరచారు. అధికారమంటే అదే మరి. దాని దర్జాయే వేరు. అదే ప్రతిపక్షంలో ఉన్న వారికి డబ్బులు ఉంటాయా? అంటే ఉండవు. అందుకే వారు మాటలతోనే కాలం వెళ్లదీస్తుంటారు. మన నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. అయినా అధికార పార్టీలో బలుపు మాత్రం పోవడం లేదు. మా మాటే నెగ్గాలనే పంతం మాత్రం తగ్గడం లేదు. అందరు నోరేసుకుని తిరుగుతున్నారు కానీ పనులు చేసే వారు మాత్రం కాదనే వాదనలు కూడా వస్తున్నాయి.

వాపును చూసుకుని బలుపు అని మురుస్తారు కొందరు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేసేది అదే. రాష్ట్రమంతా సమస్యల్లో ఇరుక్కుంటే తాము చేస్తున్న పాలన రామరాజ్యంలా ఉందని విర్రవీగుతున్నారు. అన్ని తామే చేశామని గొప్పలకు పోతున్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా మారిందని సెలవిస్తున్నారు. ఉద్యోగులకు మాత్రం ఒకటిన జీతాలు ఇవ్వడం లేదు. ఏమైనా అంటే తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతారు. మరి అప్పులెందుకు ఉన్నాయంటే సమాధానం చెప్పరు.
వరంగల్ లో టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో రోడ్డు వెంట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది కార్మికులకు మద్యం బాటిళ్లు, చికెన్ సరఫరా చేశారు. అధికార పార్టీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. మందు, మాంసం బహిరంగంగానే పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది రాబోయే ఎన్నికల్లో పార్టీకి గుదిబండగా మారనుంది. టీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎన్నికలకు ముందే ఇలా మద్యం, మాంసం సరఫరా చేస్తుంటే ఎన్నికల్లో ఇంకా ఎన్ని అక్రమాలు చేస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురు కానుందని సర్వేలు చెబుతున్నాయి. లిక్కర్, చికెన్ పంచడంతో అందరు పండుగ చేసుకున్నారు. టీఆర్ఎస్ నేత ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.