Homeజాతీయ వార్తలుKCR- National Politics: తెలంగాణను వీడి కేసీఆర్‌ ఏం సాధిస్తారు.. జాతీయ రాజకీయాలు అంత ఈజీనా?

KCR- National Politics: తెలంగాణను వీడి కేసీఆర్‌ ఏం సాధిస్తారు.. జాతీయ రాజకీయాలు అంత ఈజీనా?

KCR- National Politics: మన ఎదుగుదలకు కారణమైన మూలాలను విస్మరిస్తే.. మొదటికే మోసం వస్తుందంటారు పెద్దలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, నడుమంత్రపు సిరి.. నడుమంత్రపు హోదా చూసుకుని ఎగిరి పడొద్దని చెబతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీరు మాత్రం.. పెద్దలు ఏవైతే చేయొద్దన్నారో.. అదే చేస్తున్నారు. తన ఎదుగుదలకు కారణమైనా.. తనకు అధికారం ఇచ్చిన పార్టీని, ప్రజలనే వీడాలనుకుంటున్నారు. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌.. టీఆర్‌ఎస్‌ అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ పేరు చెప్పినా.. టీఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకున్నా.. గుర్తొచ్చేది తెలంగాణ. దేశంలో మనే అంశానికీ ఇంత ప్రాధాన్యం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. సెంటిమెంటును రగిల్చారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. స్వరాష్ట్రం సిద్ధించాక అదే సెంటిమెంటుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మోదీపై కోపం.. ప్రధానమంత్రి కావాలనే ఆశతో తెలంగాణను మర్చిపోవాలనుకుంటున్నారు. ఏ ఉద్యమం, ఏ టీఆర్‌ఎస్‌ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో అ పార్టీని, ఆ తెలంగాణను మార్చేయాలని డిసైడ్‌ అయ్యారు. తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని చరిత్ర గర్భంలో కలిపేయనున్నారు. తెలంగాణ ప్రజల పార్టీని లేకుండా చేస్తున్న కేసీఆర్‌ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారు. అంతే టీఆర్‌ఎస్‌ ఇక తెలంగాణ ప్రజలకు దురమైనట్లే.

KCR- National Politics
KCR

ప్రజల్లో గులాబీ గుర్తులు..
ఇప్పటి వరకూ జాతీయ పార్టీలన్నీ దండగ.. తెలంగాణ మన ఇంటి పార్టీ.. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్‌ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్‌ టీఆర్‌ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటీనీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర వేయడంతో మన పార్టీ అనే భావన పెరిగింది. ఇప్పుడు మన పార్టీని కేసీఆర్‌ అంతర్థానం చేస్తున్నారు.

Also Read: Balakrishna Unstoppable With Chandrababu: బాలయ్య షోకు చంద్రబాబు.. ఇక వాళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు..

చేతలకు.. చేయబోకే రాజకీయాలకు పోలికేది?
కేసీఆర్‌ అంటే ప్రాంతీయ ఉద్యమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి వారు. ఆయన తమ ప్రాంతం కోసం పోరాడారని అనుకుంటారు. ఆయనను జాతీయ నాయకుడిగా చూసే ముందు తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడారని గుర్తు పెట్టుకుంటారు. అలాంటి రాజకీయ నేత ఇప్పుడు దేశ మొత్తానికి మెరుగైన రాజకీయం చేస్తానని బయలుదేరితే ఎవరైనా నమ్ముతారు. కేసీఆర్‌ చేసిన ప్రాంతీయ ఉద్యమాలకు.. ఆయన చెబుతున్న దేశ రాజకీయాలకు పొంతన ఉండదు. అసలు కుదరనే కుదరదు. ప్రజల్లో నమ్మకం లేదు. ఇతర రాష్ట్రాల ప్రజల సంగతేమో కానీ.. కేసీఆర్‌ తెలంగాణనూ వదిలేశారని అక్కడి ప్రజలు నమ్మితే పునాదులు కదిలిపోతాయి.

KCR- National Politics
KCR- National Politics

ఆర్థిక బలాన్ని నమ్ముకుని..
ఆర్థిక బలంతో ఏదైనా చేయవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారు. కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు కానీ.. మరో విధంగా ఆయనతో కలిసి రాజకీయాలు చేసేందుకు కానీ దేశంలో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి పిలిచారన్న కారణంతో కొంత మంది నేతలు వచ్చి మొహమాటంతో ప్రెస్‌ నోట్లు విడుదల చేసి వెళ్లారు కానీ వారూ కేసీఆర్‌ రాజకీయంలో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీ పెట్టక ముందు కొంత మంది కలిశారు కానీ ఇప్పుడు ఇంకెవరూ కలిసే అవకాశం ఉండదు. చాన్స్‌ కూడా ఇవ్వరు. అయితే కేసీఆర్‌ అపరిమితమైన ధనబలంతో రాజకీయాలు చేయవచ్చని గట్టి నమ్మకంతో ఉన్నారు. అది ఎంత వరకూ సాధ్యమో.. ముందు ముందు తేలుతుంది.
అయితే మూలాలు మరిచిన వారికి ఎప్పుడూ విజయాలు లభించవని పెద్దలు చెబుతూంటారు. ఆ ప్రకారం తెలంగాణను మరిచి కేసీఆర్‌ సాధించేది ఏముంటుందనేది ఎక్కువ మంది భావన!

Also Read: CM Jagan Fitness Secrete: సీఎం జగన్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. ఇష్టంగా ఆయన ఏం తింటారు? ఆహార మెనూ ఏంటి..?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version