టీఆర్ఎసోళ్లు మాయ చేశారే!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సినీ ఇండస్ట్రీలో ఒక భయం ఉండేదీ. ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం ఆంధ్రప్రాంతానికి చెందిన వారు ఉండడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక తమకు భవిష్యత్తు ఉండదేమోనని పలువురు సినీ ప్రముఖులు భయాందోళన చెందారు. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నఆంధ్రాప్రాంతానికి చెందిన వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కామ్ గా ఉన్నారు. ఒకవేళ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఉనికి ఉండదేమోనని అనుకున్నారు. Also Read: […]

Written By: NARESH, Updated On : November 22, 2020 10:27 am
Follow us on

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సినీ ఇండస్ట్రీలో ఒక భయం ఉండేదీ. ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం ఆంధ్రప్రాంతానికి చెందిన వారు ఉండడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక తమకు భవిష్యత్తు ఉండదేమోనని పలువురు సినీ ప్రముఖులు భయాందోళన చెందారు. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నఆంధ్రాప్రాంతానికి చెందిన వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కామ్ గా ఉన్నారు. ఒకవేళ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఉనికి ఉండదేమోనని అనుకున్నారు.

Also Read: బికినీలో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న రకుల్

కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత పరిస్థితి మారింది. అంతకుముందు భయపడ్డవారు ఇప్పడు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ సినిమా పరిశ్రమకు సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల మెగాస్టార్, నాగార్జున లాంటి ప్రముఖులు కేసీఆర్ ను కలిశారు. సినిమా పరిశ్రమను నిర్మించడానికి ల్యాండ్ ప్రతిపాదన పెట్టగా దానికి కేసీఆర్ ఓకే చెప్పారు.ఇక మరెన్నో హామీలు సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఇచ్చారు. వారి పట్ల సానుభూతితో వ్యవహరించారు. ఆటంకాలను పరిష్కరించారు.వారు కోరుకున్న వాటికి ఓకే చెప్పారు.

ఇప్పుడు ఆ ప్రతిఫలాన్ని తీర్చుకోవాల్సిన సమయం సినిమా స్టార్లకు వచ్చింది. ప్రస్తుత జీహెఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ టఫ్ ఫైటిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ అవకాశమున్న ప్రతీదాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సినీ ప్రముఖులతో ప్రచారం చేయిస్తోంది. ఈ శనివారం సినిమా పరిశ్రమకు చెందిన కొందరు టీఆర్ఎస్ కు ఓటెయ్యాలని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.

Also Read: ఎట్టకేలకు మహేష్ మూవీ స్టాట్.. సెంటిమెంట్ రిపీట్..!

సినీ నటుడు, రచయిత అయిన పోసాని క్రుష్ణ మురళి ఎన్టీఆర్ తరువాత అంతటి మహానుభావుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. ఆంధ్రుల బాగోగులను చూసుకునే కేసీఆర్ మద్దతునిచ్చి టీఆర్ఎస్ కు ఓటెయ్యాలని కోరారు. ఇక ప్రఖ్యాత యాంకర్ సుమ కేటీఆర్ నువ్వు సూపర్ సార్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. పలు సినీ కార్యక్రమాలో ఎవరెవరి గురించో చెప్పుకుంటాం.. కానీ అన్ని విలువలున్న కేటీఆర్ గురించి చెప్పుకోవాలని సుమ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై భగ్గుమన్న కొందరు నెటిజన్లు సుమను సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

మరోవైపు డైరెక్టర్ ఎన్. శంకర్ సైతం టీఆర్ఎస్ కు మద్దతునివ్వండని చెబుతున్నారు. ఇలా సినీ ప్రముఖులంతా టీఆర్ఎస్ పై మక్కువ చూపించడంతో బీజేపీ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్