
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మందిరం.. మసీదును ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈనేపథ్యంలో తెలంగాణలోని క్రిస్టియన్లు సైతం కొత్త సెక్రటేరియట్లో చర్చిని కూడా నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిని చేసింది. దీనిపై క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి చర్చిని కూడా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?
తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్ శిథిలావస్థకు చేరుకోగా ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మించేందుకు గతంలోనే శంకుస్థాపన చేసింది. పాత సెక్రటేరియట్ ను ప్రభుత్వం కూల్చకుండా ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చే పనులు చేపట్టింది. ఈక్రమంలోనే సెకట్రేరియట్ శిథిలాలు పక్కనే మసీదు, మందిరాలపై పడ్డారు. దీంతో ఈ రెండు నిర్మాణాలు కూలిపోయాయి. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఊహించిన విధంగా ఈ సంఘటన జరిగినట్లు ప్రకటించారు.
కొత్త సెక్రటేరియట్లో ప్రభుత్వమే అన్ని ఖర్చులతో మసీదు, మందిరం నిర్మాణం చేస్తుందని హామీ ఇచ్చారు. దీనిపై తాజాగా క్యాబినెట్లో చర్చించినట్లు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మిస్తుందని తెలిపారు. నిర్మాణం పూర్తయిన వెంటనే వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిపారు. అదేవిధంగా 1500 అడుగుల విస్తీర్ణంలో మందిరాన్ని నిర్మిస్తుందని తెలిపారు. నిర్మాణం పూర్తికాగానే దేవాదాయశాఖ మందిరాన్ని అప్పగిస్తుందని తెలిపారు.
Also Read: మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?
ఈ రెండు నిర్మాణాలతోపాటు కొత్త సెక్రటేరియట్లో చర్చిని కూడా నిర్మించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. క్రిస్టియన్ల కోరిక మేరకు ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా ఆదరిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే గంగా జమునా తహజీబ్ కు అద్దంపట్టేలా అన్నింటికి ఒకేరోజు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Comments are closed.