TRS-BJP: సామాజిక మాధ్యమాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచంలో ఏదైనా ఇంట్లో నుంచే చేయవచ్చు. ఇందులో భాగంగానే అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతూ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి వాటిని వాడుతూ తమ ప్రచారం తామే చేసుకుంటున్నారు. ఎవరితో పని లేకుండా వారు అనుకున్నది పోస్టు చేస్తూ అందరిలో ఆలోచనలు పెంచుతున్నారు. దీనికి గాను రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలు మలుచుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు పోటీ పడుతూ పోస్టులు పెడుతూ నానా హంగామా చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. బీజేపీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పలు కోణాల్లో పోస్టులు పెట్టడంతో పోలీసు కేసులు పెట్టే వరకు వెళ్లడం గమనార్హం. ప్రత్యక్షంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని కించపరిచే విధంగా చూపిస్తున్నారు. దీంతో పార్టీల్లో ఆందోళన నెలకొంటోంది.
Also Read: కేసీఆర్ కు షాక్.. బీజేపీ ప్రతిఘటన.. రక్తికడుతున్న తెలంగాణ రాజకీయం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను అసభ్య పదజాలంతో దూషిస్తూ బీజేపీ నేతలు పోస్టులు పెట్టడాన్ని టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విరివిగా వాడుతున్నారు. అగ్ర నేతలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంపై వారు పోలీసులను ఆశ్రయించిన సంఘటనలు కూడా చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసభ్య పదజాలంపై హెచ్చరికలు కూడా వస్తున్నాయి.
అయినా నేతల్లో మార్పు కనిపించడం లేదు. సోషల్ మీడియాను బీజేపీ నేతలు వినియోగించుకునే కేటీఆర్ కుమారుడిపై పోల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ బీజేపీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈక్రమంలో బీజేపీ తీరుపై టీఆర్ఎస్ కూడా తగిన విధంగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పలు కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీ ని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్.. అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల గుర్రు