https://oktelugu.com/

TRS Flexis In Delhi: ఢిల్లీలో హిందీ ఫ్లెక్సీల ఏర్పాటులో ఆంతర్యం అదేనా?

TRS Flexis In Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు. అన్ని హిందీలోనే ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో అందరు హిందీలోనే మాట్లాడటంతో కేసీఆర్ ఫ్లెక్సీలు అక్కడి వారికి అర్థమయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అన్ని ఫ్లెక్సీలు తెలుగులో కాకుండా హిందీలో ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాదిలో పట్టుకోసం […]

Written By: Srinivas, Updated On : April 10, 2022 8:12 am
Follow us on

TRS Flexis In Delhi: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు. అన్ని హిందీలోనే ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో అందరు హిందీలోనే మాట్లాడటంతో కేసీఆర్ ఫ్లెక్సీలు అక్కడి వారికి అర్థమయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అన్ని ఫ్లెక్సీలు తెలుగులో కాకుండా హిందీలో ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాదిలో పట్టుకోసం పాకులాడుతున్నారని తెలుస్తోంది.

TRS Flexis In Delhi

TRS Flexis In Delhi

జాతీయ రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న కేసీఆర్ కు ఈ ధర్నా ను ఉపయోగించుకోనున్నారు. ఉత్తరాదిలో రైతు సంఘాలను కూడా ఆహ్వానించారు. వరిధాన్యం కొనుగోలు చేసే వరకు విశ్రమించేది లేదని చెబుతూ ఢిల్లీలో తన ఉనికి చాటుకోవాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ధర్నాలో దాదాపు 1500 మంది టీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: CM KCR: జీతాల్లేవ్ మరీ.. అప్పులు చేస్తున్న కేసీఆర్ సార్?

ధర్నా ద్వారా కేసీఆర్ రైతులనుద్దేశించి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రైతులను ఏకం చేసే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి కేంద్రంపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. అందుకే ఢిల్లీలో ఆందోళన చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో కేంద్రం విధానాలను విమర్శిస్తూ దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ నిరసనలో భాగంగా ఎంత మేర విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

TRS Flexis In Delhi

KCR

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే ఉధ్దశంతోనే కేసీఆర్ ఢిల్లీ బాట పడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని తెలిసినా కేసీఆర్ తన ప్రయత్నాలు మానుకోవడం లేదు. ప్రత్యక్షంగా బీజేపీ లక్ష్యంగా చేసుకుని నిరసనలు చేపట్టేందుకు ముందుకు వెళ్లినా ప్రతిఫలం మాత్రం దక్కదని తెలుస్తోంది. అయినా తనలోని మొండి వైఖరితోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Also Read: AP New Cabinet: పాతవారికే ప్రాధాన్యమిస్తున్నారా? మంత్రివర్గ విస్తరణలో జగన్ కు షాకిస్తున్న సీనియర్లు?

Tags