
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఇంకా గందరగోళం వీడలేదు.ఆయన ఏ పార్టీలో చేరుతారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేకుండా ఉన్నారు. తాజాగా జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీఆర్ఎస్, బీజేపీలు రెండు పార్టీలు ఆహ్వానించాయని.. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నానని .. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రమణ చెప్పారు. దీంతో ఆయన డైలమా ఇంకా తీరలేదని అర్థమవుతోంది.
ఇప్పటికే ఈటల రాజేందర్ స్థానంలో ఎల్.రమణను తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లితో ఎల్.రమణకు ఫోన్ చేయించి అడిగారు కూడా.త్వరలోనే భర్తీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
అయితే ఎల్. రమణ మాత్రం బలహీనవర్గాల బిడ్డగా దాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఎవరు పెద్దపీట వేస్తే ఆ పార్టీలోకే వెళ్లాలని చూస్తున్నట్టు తెలిసింది. తొలినాళ్ల నుంచే టీడీపీ అభివృద్ధికి కృషి చేశాడు ఎల్. రమణ. ఎన్టీఆర్, చంద్రబాబు తనను ప్రోత్సహించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఎంపీగానే సేవలందించారు. టీడీపీ నుంచి బలమైన బీసీ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఈయనను చేర్చుకొని క్యాష్ చేసుకోవాలని యోచిస్తున్నారు