హుజురాబాద్ లో గెలుపెవరిది?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దక్కిన విజయంతో బీజేపీ సంతోషించినా తరువాత జరిగిన నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం జరగడంతో చతికిలపడిపోయింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బతీయడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈటలను బహిష్కరించిన తరువాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇంత దాకా వచ్చిన తరువాత ఉపఎన్నికను ఎదుర్కోవడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. హుజురాబాద్ లో బీజేపీకి ఎప్పుడు బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ […]

Written By: Srinivas, Updated On : June 14, 2021 3:31 pm
Follow us on

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దక్కిన విజయంతో బీజేపీ సంతోషించినా తరువాత జరిగిన నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం జరగడంతో చతికిలపడిపోయింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బతీయడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈటలను బహిష్కరించిన తరువాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇంత దాకా వచ్చిన తరువాత ఉపఎన్నికను ఎదుర్కోవడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు.

హుజురాబాద్ లో బీజేపీకి ఎప్పుడు బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో పాతుకుపోయిన ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. దీంతో బీజేపీ రేసులోకి వచ్చినట్టే. ఇక్కడ ఈటల ఓడిపోతే ఎంత నష్టం జరుగుతుందో బీజేపీకి బాగా తెలుసు.

ఈటల స్వతంత్రుడిగా బరిలో దిగితే అన్నివర్గా మద్దతు లభించేది బీజేపీలో చేరడం వల్ల చాలా మంది మద్దతు కోల్పోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఈటల ఓడిపోతే కనుక బీజేపీకే నష్టం అని తెలుస్తోంది. ఈటల పంతం నెగ్గించుకోవాలంటే కచ్చితంగా హుజుాబాద్ లో గెలిచితీరాలి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలు పదునుగా ఉంటాయి. ఆయనను ఢీకొని గెలవడం అంటే ఆషామాషీ కాదు. అవకాశాలు వినియోగించుకోవడంలో సిద్ధహస్తుడు. అధికార పార్టీ అయినందున అంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని తద్వారా విజయం అందుకోవాలని బావిస్తున్నారు. బీజేపీ సైతం అదే స్తాయిలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు పోటీ పడుతోంది.