https://oktelugu.com/

BJP vs TRS: బీజేపీ మైలేజ్ తగ్గించేందుకు టీఆర్ఎస్ ఆపసోపాలు.. తెగ కష్టపడుతున్న కేటీఆర్

BJP vs TRS: దేశంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలున్నా.. ఉత్తరభారతదేశంలోని బీజేపీకి పట్టున్న ప్రాంతాలున్నా కూడా ఏరికోరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో పెట్టించారు. ఈ మధ్య జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటూ బుసలు కొడుతున్న కేసీఆర్ పీచమణిపించేందుకు.. టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బకొట్టేందుకే హైదరాబాద్ లో దేశ అత్యున్నత పార్టీ అయిన బీజేపీ తన సమావేశాలు నిర్వహణకు పూనుకుంది. తద్వారా బీజేపీలో జోష్ నింపి టీఆర్ఎస్ ను చావు దెబ్బ తీసేందుకు రెడీ అయ్యింది. తెలంగాణపై […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2022 10:28 am
    Follow us on

    BJP vs TRS: దేశంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలున్నా.. ఉత్తరభారతదేశంలోని బీజేపీకి పట్టున్న ప్రాంతాలున్నా కూడా ఏరికోరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో పెట్టించారు. ఈ మధ్య జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటూ బుసలు కొడుతున్న కేసీఆర్ పీచమణిపించేందుకు.. టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బకొట్టేందుకే హైదరాబాద్ లో దేశ అత్యున్నత పార్టీ అయిన బీజేపీ తన సమావేశాలు నిర్వహణకు పూనుకుంది. తద్వారా బీజేపీలో జోష్ నింపి టీఆర్ఎస్ ను చావు దెబ్బ తీసేందుకు రెడీ అయ్యింది.

    తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందనడానికి ఈరోజు నుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలే నిదర్శనం. ఈ సమావేశానికి దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితర కేంద్రమంత్రులంతా హాజరవుతున్నారు. దాదాపు రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే వీరంతా ఉండనున్నారు.

    తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించి మైలేజ్ తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని కీలక వ్యూహకర్తలను ఇక్కడికి రప్పిస్తోంది. వారితో సమావేశాలు నిర్వహించి తెలంగాణపై స్కెచ్ గీస్తోంది. హైదరాబాద్ ను దాదాపు కాషాయ మయం చేసేసింది. సోషల్ మీడియాలోనూ బీజేపీ నేతలు బీజేపీకి మైలేజ్ తెచ్చేందుకు తెగ పోస్టులు పెడుతున్నారు.

    ఇక బీజేపీకి చెక్ పెట్టి దాని స్థాయి పెరగకుండా.. ప్రజల్లో మైలేజ్ రాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ‘సాలు మోడీ సంపకు మోడీ’ అంటూ ఫ్లెక్సీలతో రచ్చ చేసింది. ఆ తర్వాత ఈరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రకటనలు పత్రికల్లో రాకుండా మొదటి పేజీని బుక్ చేసుకొని ‘రైతుబంధు’ ప్రకటనలు అన్నింట్లోనూ గుప్పించింది. ఇప్పటికే మోడీకి బీజేపీకి షాకివ్వాలని జీహెచ్ఎంసీలోని బలమైన కార్పొరేటర్లను టీఆర్ఎస్ లో చేర్పించుకొని షాక్ ఇచ్చింది. ఓ వైపు మోడీకి ఘనంగా వెల్ కం చెప్పడానికి బీజేపీ రెడీ అవుతుంటే..ఆ పార్టీ నేతలను లాగేసి నైతికంగా దెబ్బతీసేందుకు మంత్రి కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బీజేపీకి అడుగడుగునా చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

    ఇప్పటికే బీజేపీకి మైలేజ్ రాకుండా నగరంలోని హోర్డింగ్ లను టీఆర్ఎస్ బుక్ చేసుకొని కేసీఆర్ పథకాలతో నింపేస్తోంది. బీజేపీ ప్రచారానికి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఈ సమావేశాల ముందర ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను రైతులకు పంచి బీజేపీ నేతలకు షాకిచ్చింది.ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసి బీజేపీకి దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలని నిర్ణయించింది.

    జూలై 3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల రోజే జాతీయ, రాష్ట్ర మీడియాకు భారీగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. తద్వారా బీజేపీకి స్కోప్ లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ పనులన్నింటిని మంత్రి కేటీఆర్ బృందం దగ్గరుండి చూసుకుంటోందట.. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని .. వాళ్లకు మైలేజ్ రాకుండా అన్ని పనులు చేస్తోందట.. ఇందుకోసం కేసీఆర్ తెగ కష్టపడుతున్నాడని టాక్ నడుస్తోంది.