https://oktelugu.com/

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ ని ఇంటికి పిలిచి ఘోరంగా అవమానించిన స్టార్ హీరో

Devi Sri Prasad: మన టాలీవుడ్ లో టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు దేవిశ్రీ ప్రసాద్..ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుండి దేవిశ్రీప్రసాద్ అందించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ టాలీవుడ్ లో ఏ సంగీత దర్శకుడు కూడా అందించలేదు అని చెప్పొచ్చు..ఆయన కంపోజ్ చేసిన పాటకి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలోళ్ల వరుకు కాళ్ళు కడపాల్సిందే..అంత హుషారు గా ఆయన ఆల్బమ్స్ లోని పాటలుంటాయి..ఇటీవలే ఆయన పుష్ప సినిమాకి అందించిన మ్యూజిక్ ఏ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 2, 2022 / 10:48 AM IST
    Follow us on

    Devi Sri Prasad: మన టాలీవుడ్ లో టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు దేవిశ్రీ ప్రసాద్..ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుండి దేవిశ్రీప్రసాద్ అందించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ టాలీవుడ్ లో ఏ సంగీత దర్శకుడు కూడా అందించలేదు అని చెప్పొచ్చు..ఆయన కంపోజ్ చేసిన పాటకి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలోళ్ల వరుకు కాళ్ళు కడపాల్సిందే..అంత హుషారు గా ఆయన ఆల్బమ్స్ లోని పాటలుంటాయి..ఇటీవలే ఆయన పుష్ప సినిమాకి అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం..ముఖ్యంగా శ్రీవల్లి పాట కి జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇంతతి బ్లాక్ బస్టర్ ఆల్బం చేసినా తర్వాత కూడా మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో థమన్ మరియు అనిరుద్ తో పోలిస్తే దేవి శ్రీ ప్రసాద్ డిమాండ్ బాగా తగ్గిపోయింది..ఏ స్టార్ హీరో అయినా కూడా ముందుగా చూసేది ఈ ఇద్దరి వైపే.

    Devi Sri Prasad

    Also Read: YCP Plenary 2022: ప్లీనరీల్లో పితులాటకం.. వైసీపీలో వెలుగుచూస్తున్న విభేదాలు…

    అయితే ఇటీవల ఒక హీరో దేవి శ్రీ ప్రసాద్ తో ప్రవర్తించిన తీరు ఆయనని చాల అవమానం కి గురి అయ్యేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక అసలు విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ కి ఎంతో సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరో ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ తో ఓ సినిమా ఒప్పుకున్నాడు..రెండు మూడు పాటలు కూడా కంపోజ్ చేయించుకున్నాడు..కానీ అవి విన్న తర్వాత ఆయనకీ ఏ మాత్రం నచ్చలేదు..దీనితో ఆ చిత్ర నిర్మాత దేవి శ్రీ ప్రసాద్ కి కూడా చెప్పకుండా వేరే సంగీత దర్శకుడికి ఆఫర్ ఇచ్చేసాడు..ఈ విషయం ఆ హీరో దేవి కి ఎలా చెప్పాలో తెలియక ఇంటికి పిలిపించి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఈ విషయాన్నీ తెలియ చేసాడట..దీనితో దేవి శ్రీ ప్రసాద్ చాలా తీవ్రమైన అవమానం కి గురైనట్టు తెలుస్తుంది..వేరే ఏ హీరో ఇలా చేసిన పెద్దగా ఫీల్ అయ్యిఉండేవాడిని కాదు కానీ..బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న హీరోనే ఇలా చెయ్యడం తో దేవి శ్రీ ప్రసాద్ మనసు చాలా నొచ్చుకుందట..ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

    Devi Sri

    Also Read: Vangaveeti Radha Krishna: జనసేన గూటికి వంగవీటి రాధాక్రిష్ణ.. ముహూర్తం ఫిక్స్..

    Tags