Sharmila: తెలంగాణలో రాజన్య రాజ్యం స్థాపనే ధ్యేయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల వైఎస్ఆర్‌టీపీ అనే పార్టీ పెట్టారు. దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పాదయాత్ర మొదలు పెట్టారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. పల్లె పల్లెను పలకరిస్తూ వెళ్తున్నారు. చేవెళ్లలో మొదలు పెట్టిన ఈ పాదయాత్ర 400 రోజుల పాటు సాగి చివరికి చేవేళ్లలో వచ్చి ముగుస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్తిస్తున్నారు.

షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి బాగా కష్టపడుతున్నారు షర్మిల. పార్టీ నిర్మాణం కోసం చాలా కృషి చేస్తున్నారు. తెలంగాణలో సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సందిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని, కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో సమస్యలు లేవని ఉన్నాయని నిరూపిస్తానని, ఒక వేళ సమస్యలకు లేకపోతే ముక్కు నేలకు రాసి ఇక్కడి నుంచి వెళ్లిపోతానని అన్నారు. ఈ సవాల్‌ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వీకరిస్తారా అని ఓ దశలో ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ, టీఆర్ఎస్ నుంచి ఏ నాయకుడు కూడా స్పందించలేదు.
అయితే ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం షర్మిలపై కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రతీ మంగళవారం దీక్ష చేపడుతున్నారు. ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కూడా మంగళవారం నాడు ఆమె దీక్ష చేపడుతున్నారు. దీనిపై నిరంజన్ రెడ్డి స్పందించారు. తన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మంగళవారం మరదలు బయలుదేరారు’’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక మహిళను ఆ విధంగా సంబోధించడం సరికాదు అంటు మండిపడుతున్నారు.
స్పందించని వైఎస్ అభిమానులు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంటే చాలా మందికి అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలపై ఓ మంత్రి ఈ రకంగా కామెంట్స్ చేసినా.. ఆయన అభిమానులు స్పందిచకపోవడం ఆలోచింపజేస్తుంది. ఓ మహిళా నేత మాత్రం పది మంది నాయకులను తీసుకెళ్లి మంత్రుల క్వార్టర్స్ వద్ద ధర్నా చేశారు. కానీ ఈ ధర్నాకు మీడియాలో పెద్ద ప్రధాన్యం లభించలేదు. వైఎస్ అభిమానులు తెలంగాణలో ఉన్నారంటూ ఇక్కడ పార్టీ పెట్టిన షర్మిలకు వారి మద్దతు లభించకపోవడం శోఛనీయం.