Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో యాంకర్ రవి... ఎలిమినేట్ అయ్యేది అతడేనా

Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో యాంకర్ రవి… ఎలిమినేట్ అయ్యేది అతడేనా

డేంజర్ జోన్ లో యాంకర్ రవి: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఎంత కీలకమయినదో అంత కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకునేది మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ. ఎనిమిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం అన్ని వారాలతో పోలిస్తే కొంచెం విభిన్నమైనదే. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. సిరి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, రవి, […]

డేంజర్ జోన్ లో యాంకర్ రవి: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఎంత కీలకమయినదో అంత కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకునేది మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ. ఎనిమిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం అన్ని వారాలతో పోలిస్తే కొంచెం విభిన్నమైనదే. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు.

Bigg Boss 5 Telugu
Siri – Lobo

ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ లో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. సిరి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, రవి, లోబో, శ్రీరామ చంద్ర అలా ఒక అమ్మాయి, ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. సామజిక మాధ్యమాల్లో, ఇతర అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే డేంజర్ జోన్ లో రవి, సిరి, లోబో లు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది పక్కా జరగబోతుంది.

అయితే, ప్రతిచోటా అన్ అఫిషియల్ పోలింగ్ సైట్స్ లో లోబోనే లీస్ట్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టీ చూస్తే లోబో ఈవారం ఎలిమినేట్ అయిపోవాలి. కానీ, లోబోని ఎలిమినేట్ చేస్తారా.. లేదా రవిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి మరోసారి పంపిస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రవిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫేక్ ఎలిమినేషన్ చేస్తారు అని అనుకుంటున్నారు. మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో ఈ ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper