Nara Lokesh Troll: అదేదో సినిమాలో బాబు మోహన్ యాచించి బతుకుతాడు.. ఒక డిఫరెంట్ మేనరిజంతో అడుక్కుంటాడు.. అమ్మా, అక్కా, అన్నా, చెల్లీ… ఇలా దీర్ఘాలు తీసి పిలుస్తుంటాడు.. చూసేవారికి ఇది నవ్వు తెప్పిస్తుంది.. అప్పట్లో కామెడీ ఆరోగ్యకరంగా ఉండేది కాబట్టి… పాత్రలు రాసే దర్శకులు కూడా హుందాగా ఉండేవారు కాబట్టి… అలాంటి పాత్రలు రక్తి కట్టేవి.. తర్వాత తర్వాత అలాంటి పాత్రలు రావడం లేదు.. అలాంటి దర్శకులు కనుమరుగైపోయారు.. ఇక నటు ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కానీ చాలా రోజుల తర్వాత అలాంటి కామెడీ టిడిపి యువ కిశోరం లోకేష్ పండించాడు.. యువ గళం పేరుతో ఆయన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తున్నాడు.. పాదయాత్ర కూడా అడుగడుగునా మేనేజ్ యవ్వారమే.. ఆ పచ్చటి కార్పెట్లు, ఆ పచ్చటి టార్పాలిన్లు.. పద్ధతిగా , కళాత్మకంగా పేర్చిన కూరగాయలు.. ఆలింగనం చేసుకునే తమ్ముళ్లు.. ఒకటా రెండా అన్ని కూడా ప్లాన్డ్ సెటప్. ఏం మాట్లాడాలో? ఏం ఫోటోలు తీయాలో కూడా సినిమా స్క్రిప్టే. ఎవరు ఎదురు వచ్చి ఆ లింగనాలు చేసుకోవాలో? ఆత్మీయంగా ముద్దులు పెట్టుకొని ఆశీస్సులు ఇవ్వాలో కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని కూడా లోకేష్ బాబు బాబు డైరెక్షన్లో జరుగుతాయి.. ఎందుకంటే ఆయన కూడా గతంలో వస్తున్నా మీకోసం అనే పేరుతో పాదయాత్ర చేసిన వాడే గనుక..

ఇక లోకేష్ బాబు తన యువ గళం అనే పాదయాత్రలో భాగంగా ఓ మీటింగ్ లో మాట్లాడాడు. “అమ్మా,అక్కా, అన్నా, చెల్లీ” అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడాడు.. అదేదో సినిమాలో బాబు మోహన్ యాచించినట్టు ప్రసంగించాడు.. దెబ్బకు అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు.. లోకేష్ ఏంటి ఇలా అడుక్కుంటున్నాడు అంటూ బిత్తర పోయారు. వాస్తవంగా ఆయన తెలుగు కృతకం.. కంఠం మరింత కృతకం.. ఒత్తులు, దీర్ఘాలు, అచ్చులు,హల్లులు సరిగ్గా పలకలేడు.. ఒక్కోసారి తత్తర పాటు తో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాడు.. దీనివల్ల అసలు అర్థం చెడిపోతుంది.. ఫలితంగా కామెడీ పుట్టుకొస్తుంది.. ట్రోలర్ లకు చేతినిండా పని దొరుకుతుంది.. ఇక మీమర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.. అన్నట్టు హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టిన చంద్రబాబుకు… తన కొడుకు కు కూడా తెలుగు నేర్పించి ఉంటే ఇంత ఖర్మ పట్టేది కాదు కదా! ఆ బిజీలో పడి ఆయన మర్చిపోయాడు.. ఇంగ్లీష్ మోజులో పడి ఈయన తెలుగునే మరిచిపోయాడు..