Citadel First Look Review: స్టార్ లేడీ సమంత మరో అడ్వెంచరస్ జర్నీకి సిద్ధం అవుతున్నారు. ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ముంబైలో సిటాడెల్ షూట్ మొదలైంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా సిటాడెల్ రూపొందుతుంది. సిటాడెల్ నుంచి సమంత లుక్ షేర్ చేశారు యూనిట్. లెదర్ జాకెట్, ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా సమంత ఉన్నారు. ఆమె గెటప్ లేడీ కిల్లర్ ని తలపిస్తుంది. హాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో సమంత లుక్ ఉంది. మయోసైటిస్ తో దీర్ఘకాలం పోరాడిన సమంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు.

చికిత్స సమయంలో కూడా సమంత ఈ సిరీస్ కోసం రెగ్యులర్ గా వ్యాయామం చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఇది సిటాడెల్ యూనివర్సల్ లో భాగంగా తెరకెక్కుతుంది. ఇండియన్ వెర్షన్ సీత ఆర్ మీనన్ రాశారు. రాజ్ అండ్ డీకేలు కూడా రచనా సహకారం అందించారు. ముంబైలో షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ నార్త్ ఇండియాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.
అనంతరం విదేశాల్లో సిటాడెల్ షూటింగ్ జరగనుంది. సెర్బియా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో గల అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ ప్లాన్ చేశారు. సమంత కెరీర్లో మైలురాయిగా సిటాడెల్ సిరీస్ నిలిచిపోయేలా ఉంది. విశేషం ఏమిటంటే ఆమెకు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ జోనర్స్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ది ఫ్యామిలీ మాన్ 2 లో సమంత నటించారు. ఆ సిరీస్లో సమంత శ్రీలంక రెబల్ రోల్ చేశారు. లేడీ టెర్రరిస్ట్ గా యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపారు. యశోద చిత్రంలో కూడా సమంత యాక్షన్ సీన్స్ చేయడం జరిగింది.

సిటాడెల్ ఆ రెండింటికీ మించి ఉంటుంది. ఇంగ్లీష్ సిటాడెల్ సిరీస్ నందు ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇండియన్ వెర్షన్ లో సమంత చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సమంత ఆడియన్స్ లో ఎక్కడలేని హైప్ తెచ్చారు. ది ఫ్యామిలీ మాన్ 2 కి మించిన సక్సెస్ సిటాడెల్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి షూట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు దర్శకుడు శివ నిర్వాణ ప్రకటన చేశారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మహానటి అనంతరం విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటిస్తున్నారు.