Prashant Kishor: పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందట అన్నట్లుగా ఉంది పీకీ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్త అని పార్టీలు నియమించుకుంటే వాటి అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతూ వివాదాలు తెస్తున్నారు. దీంతో పార్టీలు పీకే తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని ప్రకటించిన పీకే తరువాత కాలంలో మాట మార్చారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తృణమూల్ కాంగ్రెస్ అని ప్రచారం చేస్తున్నారు. దీంతో అతడి తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు పీకే ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడే పాడేస్తున్నారు. ఎటు వైపు అయితే అటే తమ మద్దతు అని ప్రకటిస్తూ ఏ పక్షం వహించకుండా స్వార్థపూరిత ధోరణిలో వ్యవహరిస్తుంటే అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పీకే మామూలు వ్యక్తి కాదని ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఎంసీ కూడా పీకేను పక్కన పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీయే దేశంలో మూడో కూటమి ఏర్పాటు చేస్తుందని చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పీకేకే సముచిత స్థానం కల్పించలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని పార్టీ ఫిరాయించినట్లు భావిస్తున్నారు. మొత్తానికి పీకే తన చతురతను ఉపయోగించి ఎటు పడితే అటు వంత పాడటం చూస్తుంటే ఆయన స్వార్థపూరిత ఆలోచనలు అందరికి అర్థమైపోయాయి.
Also Read: NewsX Pre-Poll Survey: న్యూస్ ఎక్స్ ప్రీ పోల్ సర్వే: పంజాబ్ లో ఆప్.. గోవాలో బీజేపీ
దేశంలో అధికారం చేపట్టేంత స్థాయి మమతా బెనర్జీకి లేదని తెలిసినా మూడో కూటమి ఏర్పాటుకు టీఎంసీ కృషి చేస్తుందని చెబుతూ మమతను ఆకాశానికెత్తేయడంతో ఆమెకు అనుమానం కలిగి పీకేను పార్టీ నుంచి బహిష్కరించేందుకే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీకే వ్యవహారం కాస్త అందరికి తెలియడంతో అతడిని ఎవరు కూడా దగ్గరకు రానీయడం లేదని చెబుతున్నారు.
Also Read: కొడుకు కోసం తుక్కు సామానుతో కారు తయారు చేశాడు.. మహీంద్రా ఓనర్ బంపర్ ఆఫర్