జనసేనాని పవన్ కళ్యాణ్ కు బలమే సోషల్ మీడియా.. ఆయనకు ఉన్నంత మంది అభిమానులు ఎవరికి లేరు. వారు సోషల్ మీడియాలో పులులు, సింహాల కంటే కూడా ఎక్కువ. ప్రత్యర్థి ఎవరైనా సరే పవన్ ను తిట్టాడా? వాడు చచ్చాడే.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. ట్రెండింగ్ చేస్తారు. ట్రోల్స్ చేస్తారు.. మీమ్స్ తో వారు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకునేదాకా వదలరు. అంతటి బలం బలగం సోషల్ మీడియాలో ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో వారంతా పవన్ కు ఓటు వేయలేకపోయారు.. గెలిపించలేకపోయారు. అదే విషయాన్ని ఇటీవల పవన్ చెప్పుకొని బాధపడ్డాడు కూడా.. తనకు మద్దతిచ్చే వారంతా తనకే ఓటేస్తే సమస్యలపై కొట్లాడేవాడిని కదా అని నిలదీశాడు.

అయితే పవన్ కళ్యాన్ కు ఎక్కడ బలం ఉందో ఇప్పుడు అక్కడే కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థులు.. పవన్ ను సోషల్ మీడియాలో ప్రధానంగా రెండు విషయాలపై ట్రోల్ చేస్తున్నారు.. నిన్నా మొన్నటివరకు ‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ అని ట్రోలింగ్ చేస్తూ పవన్ ను ట్యాగ్ చేస్తూ ప్రత్యర్థులు ట్రెండింగ్ చేయగా.. తాజాగా ‘సైకో పవన్ కళ్యాణ్’ ( #PsychoPawankalyan) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ఇప్పటికే 15వేలకు పైగా ట్వీట్లు పోటెత్తాయి.
ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ పలువురు నెటిజన్లు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. జనసేన అభిమానులను కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలను హైలెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీనియర్ నటుడు పోసాని మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఇదంతా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బ్యాచ్ చేస్తోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలే దగ్గరుండి ఇది ట్రెండింగ్ చేసి పవన్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. దీని వెనుక వైసీపీ ఉండి నడిపిస్తోందని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో తిరుగులేకుండా ఉన్న పవన్ ను సైతం వైసీపీ బ్యాచ్ ఇలా ఇబ్బంది పెడుతుండడం చర్చనీయాంశమైంది.