మెగా బ్రదర్ నాగబాబు ఇన్‌స్టా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మరోసారి రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో నాగబాబు రాజకీయాల పై తనకి ఆసక్తి పోయిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ నెటిజన్.. ‘రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరెలా ప్రజలకు సాయం చేయగలరని అనుకుంటున్నారు ?’ అని అడిగారు.

దానికి నాగబాబు స్పందిస్తూ.. ‘అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి అన్నమాట. లేకుంటే చేయకూడదు… అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..! అని జోక్స్ చేశాడు. నాగుబాబు అభిమానులకు క్లారిటీ ఇస్తూ.. ‘వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ నేను నా సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లను విడిచిపెట్టను’ అని స్పష్టం చేశాడు.
అనంతరం మరో నెటిజన్.. ‘మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఏం మారాలి, మనమేం చేయాలి ?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇస్తూ.. ‘మగాడి మైండ్ సెట్ మారాలి. అప్పుడే మహిళల పై అత్యాచారాలు తగ్గుతాయి’ అని నాగబాబు అన్నారు.
ఇక మరో నెటిజన్ ‘మంది ముందు మాట్లాడేవాడు పులి.. మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి’ అని నాగబాబు పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. దానికి నాగబాబు ‘మీరు తప్పు అని నిరూపిస్తా’ అంటూ సమాధానం ఇచ్చాడు.
నాగబాబు మరో ఆసక్తికరమైన మెసేజ్ ను కూడా పోస్ట్ చేశారు. ‘నేను బలహీనుడినని నువ్వు అంటే.. బలవంతుడినని చెప్పడం కోసం నేను సమయాన్ని వృథా చేయను. మరింత ధృడంగా మారి.. అసమానమైన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పు అని నిరూపిస్తాను’ అంటూ నాగబాబు మెసేజ్ చేశారు.