TDP: టిడిపి సీనియర్లలో వణుకు.. తెరపైకి నయా ఫార్ములా

1983లో టిడిపి ద్వారా ఎంట్రీ ఇచ్చిన చాలామంది నాయకులు ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. వారందరికీ టిడిపి యే దిక్కు. ఆ పార్టీని వీడి మరో పార్టీకి వారు వెళ్ళలేరు.

Written By: Dharma, Updated On : August 8, 2023 1:57 pm

TDP

Follow us on

TDP: టిడిపిలో చంద్రబాబు తర్వాత ఎవరు? లోకేష్ అంత పెద్ద బాధ్యతను మోయగలరా? పార్టీని గట్టెక్కించగలరా? అంటే సొంత పార్టీలోనే ఒక రకమైన అనుమానం. వచ్చే ఎన్నికల్లో కానీ టిడిపి ఓటమి పాలైతే ఇక కష్టమే నన్న ప్రచారం విస్తృతంగా ఉంది. అయితే అందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. చంద్రబాబు తర్వాత లోకేష్ బాధ్యతలు తీసుకుంటారా? అనేదానికంటే.. తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందా లేదా అన్నదేప్రాధాన్యతాంశంగా మారింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో గెలుపోటములను చూసింది. సంక్షోభాలను ఎదుర్కొంది. ఓటమి ఎదురైనా.. ఓటింగ్ శాతాన్ని మాత్రం పదిలపరుచుకుంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసినా.. 40 శాతం ఓట్లు సాధించింది. టిడిపికి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని తెలియజేసింది. అందుకే ప్రత్యర్థుల సైతం టిడిపి ని తక్కువగా అంచనా వేయరు. చంద్రబాబు తర్వాత సైతం జవసత్వాలు నిలుపుకోవడం టిడిపికే సాధ్యం. టిడిపికి చంద్రబాబు నాయకుడే. కానీ చంద్రబాబు తర్వాత టిడిపి ఉనికి కోల్పోతుందనడం సరికాదు.

1983లో టిడిపి ద్వారా ఎంట్రీ ఇచ్చిన చాలామంది నాయకులు ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. వారందరికీ టిడిపి యే దిక్కు. ఆ పార్టీని వీడి మరో పార్టీకి వారు వెళ్ళలేరు. అలాగని వేరే పార్టీలో వారికి ఆహ్వానాలు లేవు. అయితే 2024 ఎన్నికల్లో వారందరికీ టిక్కెట్లు వస్తాయా లేదా అన్నది చెప్పలేం. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో టిడిపికి ఆశావాహులు ఎక్కువమంది ఉన్నారు. ఎవరు పార్టీని వీడినా వారు వెన్నెముకగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే టిడిపిలో బహు నాయకత్వం సీనియర్లకు మింగుడు పడడం లేదు. ప్రస్తుత పరిణామాలు సీనియర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో సీనియర్లు వర్సెస్ లోకేష్ టీం అన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా భవిష్యత్ కోసమే నన్ను చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు టికెట్ ఇస్తే.. అక్కడ జూనియర్లు సహకరించాలని మెలిక పెడతారు. 2029 లో అదే జూనియర్లకు నియోజకవర్గాల అప్పగిస్తామని హామీ ఇస్తారు. అంతకుమించి ఏమీ లేదు. చంద్రబాబు ఉన్నా లేకున్నా.. పార్టీని నిలబెట్టే క్రమంలో ఈ ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.