Himachal Pradesh: ఈ సన్నివేశం సినిమాటిక్ గా ఉన్నప్పటికీ చాలామందిని ఆకట్టుకుంది. పుష్ప సినిమా మొదటి పార్ట్ విజయవంతమవడంలో ఈ సన్నివేశం కూడా ముఖ్యపాత్ర పోషించింది. ఇలాంటి సన్నివేశం నిజ జీవితంలో చోటు చేసుకోవడం దాదాపు అసాధ్యం. అయితే దీనిని నిజం చేసే సంఘటన ఒకటి జరిగింది. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి సంచలనంగా మారింది.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పర్వతాలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొండ ప్రాంతాలలో చెట్లు మొత్తం కూలిపోయి ఆ వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. దాదాపు వేలాది కర్ర దుంగలు కొట్టుకు వస్తున్న తీరు పుష్ప సినిమాను తలపిస్తోంది. వరద నీటిలో వస్తున్న కర్ర దుంగలకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది ఔత్సాహికులు తమ ఫోన్లలో ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ” పుష్ప సినిమాలో సన్నివేశం నిజంగా కనిపిస్తోంది. వరద నీరు వల్ల కర్ర దుంగలు కొట్టుకు వస్తున్నాయి. ఆ సన్నివేశం చూస్తుంటే నిజంగా పుష్ప సినిమా కళ్ళ ముందు కనిపిస్తోంది. వేలాది కర్ర దుంగలు అలా రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఇలాంటి సన్నివేశం నిజ జీవితంలో కూడా చోటు చేసుకోవడం వింతగా ఉందని” స్థానికులు అంటున్నారు.
రుతుపవనాలు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత చురుకుగా కదులుతున్నాయి.. ఫలితంగా అక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుంది. అక్కడ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.. అయినప్పటికీ నష్టం భారీగానే ఉన్నది. వరద నీరు వల్ల పంట పొలాలు మొత్తం నీటి మునిగిపోయాయి. పండ్ల తోటలు మొత్తం నాశనమయ్యాయి. గతంలో పర్వత ప్రాంతాలలో అంతగా నష్టం ఉండేది కాదు. కానీ విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల పర్వతప్రాంతాలలోనూ భారీగా నష్టం చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. పర్వత ప్రాంతాలలో నిర్మించుకున్న గృహాలు మొత్తం నేలమట్టమయ్యాయని అధికారులు వివరిస్తున్నారు.. అయితే మరి కొద్ది రోజులపాటు అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.. మరి కొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలలోనే ఉంచుతామని స్థానిక అధికారులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు.
పుష్ప సీన్ రిపీట్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో భారీ వర్షానికి వాగులో కొట్టుకొచ్చిన చెట్లు
పుష్ప సినిమాను తలపిస్తుందంటూ వీడియో చిత్రీకరించిన యువకుడు pic.twitter.com/dKBKn4WvDf
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025