Revanth Reddy Bihar Election controversy: ఇందులో బాగా సక్సెస్ అయింది మాత్రం ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్. అతని బృందంలో పనిచేసి.. ఆ తర్వాత వేరు కుంపటి పెట్టుకున్న రాబిన్ సింగ్. ప్రశాంత్ కిషోర్ మాటలన్నీ విచిత్రంగా ఉంటాయి. ఆయన వ్యూహాలు మొత్తం అత్యంత దారుణంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీని ఇష్టానుసారంగా తిట్టడం.. దారుణంగా విమర్శలు చేయడం.. ఒక రకమైన విద్వేషాలకు పాల్పడడం వంటివి అతని రూపకల్పనలో ఒక భాగం. అయితే ఇవన్నీ కూడా విజయవంతం కాలేదు. విజయవంతమైనప్పుడు ప్రశాంత్ కిషోర్ డబ్బా కొట్టుకున్నాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. క్రితం సారి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు పోటీలో ఉంటానని చెప్పి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడు.
ఇప్పుడేమో ఒక రాజకీయ పార్టీని పెట్టి.. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెబుతున్నాడు. అంతేకాదు తను బీహార్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతానని చెప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తనకు మాత్రమే సాధ్యమైన విమర్శలు చేస్తున్నాడు. అంతేకాదు విద్వేషాలు రగిలించే విధంగా కామెంట్లు చేస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ నెత్తికి అరికాలికి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచారంలో ఉంటున్నాడు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కు తెలిసింది అది మాత్రమే. సోషల్ మీడియాలో ఎంత రచ్చ లేపాలో ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. అందువల్లే అతడు విద్వేషాన్ని రగిలించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
Also Read: RK phone tap : సర్ ప్రైజ్ : ట్యాప్ అవ్వని ఫోన్ వాడే ఆంధ్రజ్యోతి ఆర్కే కాల్స్ కేసీఆర్ విన్నాడట..
ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ ఎన్నికలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు బీహార్ రాష్ట్రానికి సంబంధం లేని రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించాడు. కాంగ్రెస్ పార్టీ బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అనుకుంటున్నదని.. కానీ అది సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. అంతేకాదు ఒకవేళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కనుక తీసుకొస్తే అది ఇబ్బందికరమవుతుందని వ్యాఖ్యానించాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఇక్కడ మొత్తం పరిస్థితి విచిత్రంగా ఉందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించాడు.
ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఆ వ్యాఖ్యలు చేశాడో.. కోతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్టుగా గులాబీ పార్టీ సోషల్ మీడియాను పర్యవేక్షించేవారు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. చూశారా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో.. చివరికి ప్రశాంత్ కిషోర్ కూడా విమర్శలు చేస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రచారానికి రేవంత్ రెడ్డి గనక వెళితే వచ్చేది 0 ఫలితమే అన్నట్టుగా గులాబీ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించేవారు ఆరోపిస్తున్నారు.. రేవంత్ రెడ్డి కనీసం ఎన్నికల ప్రచారానికైనా వెళ్తున్నాడు. గులాబీ పార్టీ నాయకులకు ఆమాత్రం కూడా లేదు కదా.. దేశంలో చక్రాలు తిప్పుతానని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితమయ్యాడు కదా.. మరి ఆ విషయం గులాబీ నాయకులకు తెలియదా.. తెలిసిన కూడా తెలియనట్టు నటిస్తున్నారా?
Motor Mouth CM to cause damage for Congress in Bihar..
Will CM Revanth be kept away from Election Campaign in Bihar ❓ pic.twitter.com/1znL1mu5SF— Dr.Krishank (@Krishank_BRS) June 27, 2025