వరద బీభత్సం.. కేటీఆర్ లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

  ఈ మూడు రోజుల వానలతో మహానగరం కాస్త మహాసముద్రమైంది. మహా నగరం కాస్త.. మహా నరకమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. 1500 కాలనీలు జలమయమ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో వరదల్లో కొట్టుకుపోయారు. అటు ఆస్తి నష్టం.. ఇటు ప్రాణ నష్టం జరిగింది. ‘వాన దేవుడా.. ఇక చాలు దేవుడా..’ అని బాధితులు రోదించారు. సహాయం కోసం అర్థించారు. Also Read: హైదరాబాద్ కు ప్రయాణమా.. అస్సలు వద్దు..! ఇంత పెద్ద మహానగరంలో ఎంతో […]

Written By: NARESH, Updated On : October 15, 2020 3:03 pm
Follow us on

 

ఈ మూడు రోజుల వానలతో మహానగరం కాస్త మహాసముద్రమైంది. మహా నగరం కాస్త.. మహా నరకమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. 1500 కాలనీలు జలమయమ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో వరదల్లో కొట్టుకుపోయారు. అటు ఆస్తి నష్టం.. ఇటు ప్రాణ నష్టం జరిగింది. ‘వాన దేవుడా.. ఇక చాలు దేవుడా..’ అని బాధితులు రోదించారు. సహాయం కోసం అర్థించారు.

Also Read: హైదరాబాద్ కు ప్రయాణమా.. అస్సలు వద్దు..!

ఇంత పెద్ద మహానగరంలో ఎంతో పెద్ద వ్యవస్థ ఉంది. కానీ.. వారికి ఏ చేతులూ అండగా నిలువలేకపోయాయి. ముఖ్యంగా ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్లు సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎవరూ వచ్చి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. పరిస్థితిని సమీక్షించే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌‌ బస్తీ బాట పట్టారు.

వర్షం తీవ్రత తెలుసుకున్న మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయమే జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే.. ఆయన పర్యటనలో పలువురు కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

కేటీఆర్‌‌ చాంద్రాయణగుట్ట.. తదిరత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన కార్పొరేటర్లపై ఫైర్‌‌ అయ్యారట. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం.. ప్రజలు నిలదీయడంతో అసహనానికి గురైన ఆయన.. ‘మీ ఫాలో అప్ ఏమీ బాగోలేదని.. సీరియస్ నెస్ పట్టదా? ప్రజల కష్టాల్ని అధికారుల వరకు తీసుకెళ్లటంతో ఫెయిల్ అయ్యారు’ అని క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.

Also Read: ఏడాది వర్షం.. ఒక్క రోజులోనే కురిసిందా! షాకింగ్ నిజాలు

వర్షం వేళ తాము కష్టపడినా.. తమకు తిట్టే మిగిలినట్లుగా కార్పొరేటర్లు వాపోతున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలను తాజా వర్షాలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షంతో వరద పోటెత్తటంతో చోటు చేసుకున్న నష్టం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు. మరి ఈ లోటును ఎలా పూడ్చుకుంటారో చూడాలి మరి.