IPS Transfers: ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్నారు. భార్య భారతి తో కలిసి వారం రోజులు పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన లండన్ వెళ్లారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పదిమంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జగన్ అనుమతితోనే ఈ బదిలీలు జరిగి ఉంటాయి. కానీ కొంతమంది అధికారులపై బదిలీ వేటు వేసిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ సిటీగా ఉన్న త్రివిక్రమ వర్మను తప్పించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. గత ఏప్రిల్ లోనే ఆయన విశాఖ సిపి గా నియమితులయ్యారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయన పై బదిలీ వేటు వేశారు. విశాఖ ఎంపీ ఎంవీ సత్యనారాయణ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారమే కారణమన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలను ఆయన సంతృప్తి పరచలేకపోయారని.. అప్పట్లోనే బదిలీ వేటు వేస్తారని ప్రచారం జరిగింది.
అటు కడప ఎస్పీ అన్బురాజన్ కూడా బదిలీ అయ్యారు. వివేక హత్య కేసు విషయంలో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. సిబిఐ నివేదించడంతోపాటు నిందితులపై ఈగ వాలనియకుండా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా కాలంగా కడప లోనే ఉన్నారు. ఎన్నికల నాటికి ఆయన బదిలీ తప్పదు. అదేదో ముందుగానే జరిపించారు. పక్క జిల్లా అయిన అనంతపురానికి పంపించారు. అయితే కీలకమైన ఈ బదిలీలు చేసే సమయంలో సీఎం జగన్ ఇండియాలో లేకపోవడం విశేషం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఇలాంటి బదిలీ ఉత్తర్వులు బయటకు రావడం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏమిటి అనూహ్య పరిస్థితులు అని చర్చ అయితే మాత్రం జరుగుతోంది.