Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. తాను నటించిన ‘ఖుషి’ సినిమాపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తప్పుడు రివ్యూలు రాస్తూ కుట్ర పన్నుతున్నారని అన్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపినట్లు అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ కొందరు విజయ్ ఫ్యాన్స్ అతనికి సపోర్టు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ మరో వర్గం మాత్రం రివ్యూలతో సినిమాలు హిట్టు కొడుతాయా? అని అంటున్నారు. కేవలం రివ్యూలు మాత్రమే సినిమా జయాపజయాలు డిసైడ్ చేస్తే ‘బలగం’, ‘బేబీ’ మూవీకి మొదట్లో ఎంత రేటింగ్ ఇచ్చారు? అని అంటున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత లు కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లోకి వచ్చింది. లవ్ స్టోరీగా వచ్చిన ఈమూవీపై చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు రివ్యూలు రాశాయి. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ‘ఖుషి’ సినిమాపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, సినిమా బాగున్నా.. బాగాలేదంటూ రివ్యూలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓ వర్గం తనపై కుట్ర పన్నుతున్నదని అన్నారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉంటంది. ఆ సినిమా గురించి విపరీతంగా చర్చలు ఉంటాయి. ఈ క్రమంలో మీడియా సంస్థలు సైతం ఆ సినిమా గురించి రకరకాలుగా రాస్తారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక బాగోకపోతే ఎంత మంచి రివ్యూలు రాసినా ప్రేక్షకులు థియేటర్ వైపు వెళ్లలేరు. ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ పెట్టరు. అలా ఎంతో ఎక్స్ పెక్టేషన్ తో ఇటీవల రిలీజ్ అయిన బోళా శంకర్’, ‘బ్రో’ సినిమాలు యావరేజ్ గానే నిలిచాయి. కారణం ప్రేక్షకులు కంటెంట్ ను పసిగట్టడమే. ఇలాంటి తరుణంలో ఏ రివ్యూ ప్రేక్షకులను థియేటర్ వైపు తీసుకెళ్లలేదు.
మరి విజయ్ దేవరకొండ సినిమా ‘ఖుషి’ మాత్రమే రివ్యూలతో ప్రేక్షకులను సినిమా టాకీసులకు రానివ్వడం లేదని ఎలా అంటారు? అని కొందరు వాదిస్తున్నారు. సినిమా కంటెంట్ బాగున్న బలగం, బేబీ సినిమాను మొదట్లో ఎవరూపట్టించుకోలేదు. ఈ మూవీ గురించి తెలశాక మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనం థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. అంటే మంచి సినిమాను ఎవరూ అడ్డుకోలేరన్నది వాస్తవం. ఇది గ్రహించిని విజయదేవరకొండ తనపై కుట్ర పన్నుతున్నారని అనడం హస్యాస్పదంగా ఉందని కొందరు సినీ జనాలు అంటున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్లో గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ తరువాత అతనికి కలిసి రావడం లేదు. కానీ ఆయన మాత్రం తాను పెద్ద హీరో అయ్యానని అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మంచి కథలను ఎంపిక చేసుకునే విజయ్ దేవరకొండ పై ప్రత్యేకంగా ఎవరు కుట్ర పన్నుతారు? అనే చర్చ సాగుతోంది. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం అతనికి సపోర్టు చేస్తున్నా.. అది కేవలం సినీ అభిమానం మాత్రమే అని అర్థం చేసుకోవాలి.