ద్రోహులని పట్టించుకోను పోరాటాన్ని ఆపను: కమల్ హాసన్

సినిమాల్లోనే తానూ హీరోని కాదు, సమాజంలో కూడా తానూ హీరోనే అని, ఒకసారి కదనరంగంలోకి తానూ దూకిన తర్వాత, ఓటమి భయంతో పారిపోయే రకాన్ని నేను కాదు అంటూ తమిళ మాజీ స్టార్ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. పాపం లోకనాయకుడిగా క్రేజ్ ను సాధించిన ఈ హీరోగారు ప్రజల నమ్మకాన్ని మాత్రం సాధించలేకపోయారు. ప్రజల అభిమానాన్ని సాధించిన హీరో, వారి నమ్మకాన్ని సాధించలేక పోవడం దౌర్భాగ్యం. మొదట తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ స్థాపించాడు అన్నప్పుడు […]

Written By: admin, Updated On : May 7, 2021 4:58 pm
Follow us on

సినిమాల్లోనే తానూ హీరోని కాదు, సమాజంలో కూడా తానూ హీరోనే అని, ఒకసారి కదనరంగంలోకి తానూ దూకిన తర్వాత, ఓటమి భయంతో పారిపోయే రకాన్ని నేను కాదు అంటూ తమిళ మాజీ స్టార్ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. పాపం లోకనాయకుడిగా క్రేజ్ ను సాధించిన ఈ హీరోగారు ప్రజల నమ్మకాన్ని మాత్రం సాధించలేకపోయారు. ప్రజల అభిమానాన్ని సాధించిన హీరో, వారి నమ్మకాన్ని సాధించలేక పోవడం దౌర్భాగ్యం.

మొదట తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ స్థాపించాడు అన్నప్పుడు కూడా, ఆయన పార్టీ పై ఎవరికీ నమ్మకం కలగలేదు. చివరకు కమల్ అభిమానులు కూడా కమల్ హాసన్ ను సరిగ్గా నమ్మలేదు అని ఆయన పార్టీ శ్రేణులే చెప్పుకొచ్చాయి. ఏది ఏమైనా ఎన్నికల్లో కమల్ అతి దారుణంగా ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన పార్టీ నుంచి నాయకులు అందరూ వెళ్లిపోవడం మొదలెట్టారు.

ఇప్పటికే కమల్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి రాజీనామా పడేసి, పనిలో పనిగా కమల్ హాసన్ ను నాలుగు తిట్లు తిట్టి, అలాగే నోటికొచ్చిన ఆరోపణలు చేసేసి చక్కగా గెలిచిన పార్టీలో జాయిన్ అవ్వడానికి మంచి ఉత్సాహంగా వెళ్ళాడు. అది చూసిన మిగిలిన వాళ్ళు కూడా ఆయన్నే ఫాలో అయిపోతున్నారు. ఎటొచ్చి చివరకు కమల్ పార్టీలో కమల్ హాసన్ తో పాటు శ్రుతి హాసన్ మాత్రమే మిగిలేలా ఉన్నారు .

ఇక తన పార్టీ నుండి వెళ్ళిపోతోన్న నాయకుల గురించి కమల్ మాట్లాడుతూ.. నన్ను మోసం చేసి వెళ్లిపోయే ద్రోహులని నేను పట్టించుకోను, ఒక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినంత మాత్రాన నా పోరాటాన్ని ఎందుకు ఆపాలి, ఎట్టిపరిస్థితుల్లో నా పోరాటం ఆపేది లేదు అంటూ రెండు సినిమా డైలాగ్స్ కూడా కమల్ హాసన్ చక్కగా పలికారు. ఏది ఏమైనా 150 స్థానాల్లో పోటీచేస్తే అన్నింటా ఓడిపోవడం కమల్ హాసన్ మాత్రమే సాధించిన రికార్డు.