Traffic Restrictions
Traffic Restrictions: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండ రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈమేరకు పలు ప్రాంతాల్లో డైవర్షన్ చేశారు. కొన్ని చోట్ల వన్‌వే ఏర్పాటు చేయనున్నారు. వారంతంలో ట్రాఫిక్ ఆంక్షలు నగర వాసులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేడు రాష్ట్రపతి రాక..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం(జూన్ 16) సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. శనివారం(జూన్ 17) ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
ఆంక్షలు అమలయ్యే ప్రాంతాలు..
సీటీఓ జంక్షన్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్పీఎస్ స్కూల్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, పీవీ స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్‌ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారు.
డైవర్షన్ ఇలా..
సికింద్రాబాద్ నుంచి బేగంపేట మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్బండ్‌పై దారి మళ్లించనున్నారు. రాజభవన్ రోడ్, మొనప్ప జంక్షన్, పీవీ స్టాట్యూ ఖైరతాబాద్ మార్గాల్లో రెండు వైపులా రోడ్ మూసివేశారు. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్పరా జంక్షన్ వద్ద కొంత సమయంపాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాశ్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచించారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Traffic restrictions in hyderabad implemented for two days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com