Traffic Challan : చాలా సార్లు అత్యవసర పరిస్థితుల కారణంగా అంబులెన్స్‌కు బదులుగా, కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత కారులో అంత్యక్రియల ఊరేగింపును తీసుకువెళతారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రశ్నిస్తారా.. ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు చలాన్ జారీ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే, మీరు మృతదేహాన్ని శ్మశానవాటికకు లేదా మరేదైనా ప్రదేశానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఉపయోగించవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీటిని వాడుకోవచ్చు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించవచ్చు. కానీ తప్పనిసరి పరిస్థితిలో సొంత కారును వాడవలసి వస్తే ఆ సమయమలో ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ముందుగా మీరు ఏ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించబడతారో తెలుసుకుందాం. దీని కోసం మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఇందులో ఎర్ర లైట్లు ఉల్లంఘించడం, తప్పు వైపు వాహనం నడపడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, అతివేగం, తప్పు ప్రదేశంలో పార్కింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పాటించకపోవడం, ఆర్‌సి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటివి ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడినప్పుడు కూడా డ్రైవింగ్ చేయడం, కారును ఓవర్‌లోడ్ చేయడం, ఫుట్‌పాత్‌లు లేదా సైకిల్ ట్రాక్‌లపై వాహనాన్ని నడపడం కూడా ఇందులో చేర్చబడ్డాయి.
కారులో శవం ఉంటే?
రోడ్లపై బారికేడింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఏ కారునైనా ఆపవచ్చు. ఏ కారు డ్రైవర్‌నైనా వారు విచారించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ కారులో మృతదేహం ఉంటే, మీ పై పోలీసులకు అనుమానం రావొచ్చు. వాళ్లు మీపై చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు చలాన్ జారీ విషయానికి వస్తే.. మీరు ఎటువంటి ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించకుండా మీ వాహనాన్ని నడుపుతుంటే, మీ చలాన్ జారీ చేయబడదు. కానీ మీరు పైన పేర్కొన్న నియమాలలో దేనినైనా ఉల్లంఘిస్తే మీ చలాన్ వేయవచ్చు. మీరు మీ పరిస్థితిని పోలీసులకు పూర్తిగా వివరించాలి. వారి ప్రశ్నల వలయం నుండి బయటపడటానికి మీ అభిప్రాయాన్ని సరైన పదాలలో వ్యక్త పరచాలి.