Sedan : ప్రస్తుతం SUVs, hatchbacks, sedans కార్లలో సెడాన్ కార్లు ప్రత్యేకంగా లగ్జరీగా పరిగణించబడతాయి. ప్రస్తుతం, సెడాన్ సెగ్మెంట్లో మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సివిక్ లాంటి కార్లు ప్రముఖంగా ఉన్నాయి. అయితే, ఈ మూడు కార్లలో ఏది అత్యంత ప్రీమియం కారు అని ప్రశ్న వస్తుంది.
1. మారుతి సియాజ్: మారుతి సియాజ్ కారును ప్రారంభించబడినప్పుడు, అది పెట్రోల్, డీజిల్ రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం మారుతి సియాజ్ డీజిల్ వేరియంట్ను నిలిపివేసింది. సియాజ్‌లో మంచి స్పేస్, అందమైన లుక్‌ను అందించడం జరుగుతుంది. ఈ కారులో 300 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సురక్షితమైన ప్రయాణం కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS/EBD, హై స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ అలర్ట్, హిల్ హోల్డ్, ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2. హ్యుందాయ్ వెర్నా : హ్యుందాయ్ వెర్నా కంపెనీకి అత్యంత పాప్యులర్ సెడాన్ కారిగా ఉంది. ఇటీవల దీనికి అప్‌డేట్ వేరియంట్ను విడుదల చేశారు. వెర్నా ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ చూస్తే అద్భుతంగా ఉంది. ఫినిషింగ్, బిల్ట్ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంది. హ్యుందాయ్ వేర్నా గ్లోబల్ NCAP నుండి 5 స్టార్ రేటింగ్ అందుకుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ADAS వంటి సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.
3. హోండా సివిక్: హోండా సివిక్ కంపెనీ అత్యంత ప్రీమియం సెడాన్ కారుగా భావించబడుతుంది. ఇందులో 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హైటెక్ ఫీచర్లు అందించబడ్డాయి. దీనితో పాటు, సివిక్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సివిక్‌లో ఇంజన్ ప్రారంభించడానికి కీ అవసరం లేదు, దానిలో పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్ సిస్టమ్ ఉంది. సురక్షణలో, సివిక్‌లో ABS, EBD, స్టేబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్టెంట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కార్ల ధరలు:
మారుతి సియాజ్: రూ.9.40 లక్షల నుండి రూ.12.45 లక్షల వరకు
హ్యుందాయ్ వేర్నా: రూ.11.07 లక్షల నుండి రూ.17.55 లక్షల వరకు
హోండా సివిక్: రూ.18.04 లక్షల నుండి రూ.22.45 లక్షల వరకు
మొత్తం గా, హోండా సివిక్ అత్యంత ప్రీమియం కారుగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది అధిక ధర, అధునిక ఫీచర్లు, లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది.