MLA Roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న ఎమ్మెల్యే రోజా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో వారిపై విమర్శలు చేయడంలో ఆమెది ఓ ప్రత్యేక శైలి. ప్రతిపక్షాన్ని విమర్శించడంలో ఆమెది అందెవేసిన చేయి. తన మాటలతో ప్రత్యర్థులను కోలుకోకుండా చేయడంలో ఆమె వ్యవహార శైలిలో మార్పు ఎప్పుడు కనబడుతుంది. చంద్రబాబు సహా ఎవరినైనా తన పదునైన మాటలతో అడ్డుకుంటుంది. వారిని తన వాగ్బాణాలతో దాడి చేస్తుంటారు.
రెండు సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో జగన్ జన్మదినం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో నియోజకవర్గంలో రోజాపై అసమ్మతి పెరిగిపోతోందని తెలుస్తోంది. దీంతో నగరిలో వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినా అసమ్మతిని లెక్క చేయకుండా రోజా తన పని తాను చేసుకుంటున్నారు.
Also Read: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణాకొట్టు పెట్టుకో అంటూ రోజా ఫైర్!
రెండుసార్లు గెలిచిన రోజాకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది. రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగిని చివరి క్షణంలో ఆమెకు ఆ పదవి దక్కకుండా ఊరిస్తోంది. దీంతో రోజాకు మంత్రి పదవి వస్తుందనే ఆశలు కల్పించినా చివరి సమయంలో పరిస్థితి మారిపోతోంది. ఆమె ఆశల నెరవేరడం లేదు. కొద్ది రోజులుగా మంత్రి పదవి పై ఆశలు పెరిగిన సామాజిక వర్గం నేపథ్యంలో ఆమెకు ఆ పదవి ప్రతిసారి ఊరిస్తూనే ఉంది. కానీ నెరవేరడం లేదు.
ప్రతిపక్షాలను విమర్శించడంలో ఆమెకు సాటి ఎవరు లేరని అందరికి తెలిసిందే. కానీ నియోజకవర్గంలో అసమ్మతి పెరగడంతో నియోజకవకర్గంలో ఎలా పార్టీ కార్యక్రమాలు చేపడుతుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే సంశయాలు కార్యకర్తల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తం భారమంతా జగన్ మీద వేసి రోజా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.