
తెలంగాణలో పీసీసీ మార్పు జరుగుతుందని కొన్ని రోజులు చర్చ జరుగుతోంది. పీసీసీ కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్లంతా పోటీపడుతున్న సంగతి తెల్సిందే. ఈ రేసులో అనుహ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ నానాటికి దిగజారుతుందని అధిష్టానానికి ఫిర్యాదులు అందడంతో పీసీసీని ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేస్తోంది. పీసీసీ రేసులో తొలి నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీగా చేస్తే ఎలా ఉంటుంది? అనే కాంగ్రెస్ నేతల అభిప్రాయం కోరినట్లు సమాచారం. పీసీసీ మార్పు తథ్యమని తేలడంతో సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. అధిష్టానం పీసీసీని మార్చాలకునుంటే కాంగ్రెస్ నేతనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ లు ఈ డిమాండ్ ను ప్రముఖంగా విన్పిస్తున్నారు.
జగ్గారెడ్డికి ఉత్తమ్ క్లాస్..
తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని పీసీసీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం పీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల అభిప్రాయం కోరుతున్నట్లు చెప్పారు. పీసీసీగా కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే అవకాశం ఇవ్వాలన్నారు. పీసీసీగా రేవంత్ రెడ్డిని నియమిస్తే బేషరతుగా వ్యతిరేకిస్తానని తెలిపారు. పీసీసీగా ఉత్తమ్ ను మార్చొద్దని కోరుతానంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డి జగ్గారెడ్డిని మందలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా టైంలో పీసీసీ మార్పు గురించి మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ జగ్గారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరూ కూడా పీసీసీ మార్పుపై మాట్లాడొద్దని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ పరోక్షంగా సూచించారు.
ఈ విషయంపై జగ్గారెడ్డి స్పందిస్తూ తాను ఏ సందర్భంగా పీసీసీ మార్పుపై మాట్లాడాల్సి వచ్చిందో ఉత్తమ్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ ఇష్యూ నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతానికి ఉత్తమ్ క్లాసు తీసుకోవడంతో కాంగ్రెస్ నేతలు కొంత చల్లబడినట్లు కన్పిస్తుంది. అయితే పీపీసీ మార్పుపై కాంగ్రెస్ నేతలు లోలోపల ఒకరిపై కారాలుమీరియాలు నూరుకుంటున్నారు.