టీపీసీసీ చీఫ్ ఎంపిక చివరి దశకు.. నేడో రేపో ప్రకటన

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి దశ వరకు చాలా మంది పోటీలో ఉన్నా చివరికి ఇద్దరి పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ సీల్డ్ కవర్ లో ఒకరి పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై కొద్ది రోజులుగా పలు ఊహాగానాలు వచ్చాయి. పార్టీలో సీనియర్లు తమ వాణిని బాగానే […]

Written By: Srinivas, Updated On : June 19, 2021 11:36 am
Follow us on

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి దశ వరకు చాలా మంది పోటీలో ఉన్నా చివరికి ఇద్దరి పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ సీల్డ్ కవర్ లో ఒకరి పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై కొద్ది రోజులుగా పలు ఊహాగానాలు వచ్చాయి. పార్టీలో సీనియర్లు తమ వాణిని బాగానే వినిపించారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వొద్దని వీహెచ్ సహా పలువురు బాహాటంగానే గళం విప్పారు. దీంతో పార్టీలో ప్రధాన చర్చ జరిగింది. చీఫ్ పదవిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.

ఈనేపథ్యంలో కొద్ది నెలల నుంచి తీవ్రమైన ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి ఎంపిక చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరి దశలో ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఒకరి పేరు ఖరారు చేసి సీల్డ్ కవర్ లో ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. రేపో మాపో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీపీసీసీ చీఫ్ రేసులో చివరి వరకు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి.సీల్డ్ కవర్లో వీరిలో ఒకరి పేరే ఉందని తెలుస్తోంది. పేరును ప్రకటించే ముందు తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ మరోసారి సోనియాగాంధీతో భేటీ అయినట్లు సమాచారం. తొలి నుంచి టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ వీహెచ్, జగ్గారెడ్డి లు పోటీ పడ్డారు.

కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పేరుపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. మాణిక్యం ఠాగూర్ తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు, డీసీసీల అభిప్రాయాలు సైతం సేకరించారు. దీంతో నివేదికను సోనియాగాంధీకి అందజేశారు. చివరికి ఇద్దరి పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీరి పేర్లు సీల్డ్ కవర్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.