Homeజాతీయ వార్తలుTPCC Revanth Reddy: వైఎస్‌‌ను ఫాలో అవుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అదొక్కటే మార్గమా..?

TPCC Revanth Reddy: వైఎస్‌‌ను ఫాలో అవుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అదొక్కటే మార్గమా..?

TPCC Revanth Reddy: మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యాక కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చాయని, ఆ పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారంతా తిరిగి తమ సొంతగూటికి చేరేలా రేవంత్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ మధ్యలో పలువురు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

TPCC Revanth Reddy
TPCC Revanth Reddy

అయితే, రేవంత్‌ పార్టీని బలోపేతం చేయడానికి ఎంత పాటుపడుతున్నా సొంత పార్టీలోనే ఆయకు ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం నచ్చని సీనియర్లు పార్టీకి అంటిమట్టనట్టుగా ఉంటూ కార్యకలాపాల్లో పాల్గొనకుండా డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని తెలిసింది. దీంతో రేవంత్ రచ్చ గెలుస్తున్నా ఇంట గెలవలేకపోతున్నారు. ఈనేపథ్యంలోనే రేవంత్ దివంతగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ని ఫాలో అవుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌‌ను కొందరు సీనియర్ నేతలు ఇరకాటంలో పెట్టేవారు. కానీ ఆయన అందరితో సఖ్యతగా ఉండి తాను ఇబ్బందులు పడుతూనే రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు రేవంత్ కూడా ఆయన బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారుని తెలిసింది

Also Read: కేటీఆర్ ఎవరో తెలియదన్న షర్మిల.. ఇప్పుడు పొగడడానికి కారణమేంటో తెలుసా?

పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వీహెచ్ హన్మంతరావు, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు కలుపుకుని పోవాలని భావిస్తున్నారు. రైతుల కోసం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో వీరంతా కలిసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాస్తవానికి ఆనాడు వైఎస్‌కు మంచి పట్టుంది.

కానీ రేవంత్‌కు రాహుల్ వద్ద తప్పా సోనియాను నేరుగా కలసేంత చనవు లేదు. కానీ సీనియర్లకు మాత్రం హస్తిన పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని రేవంత్ భావిస్తున్నారట. డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం విషయంలో కూడా సీనియర్లను సంప్రదించినట్టు తెలుస్తోంది. చూడాలి మారి రేవంత్ నిర్ణయం ఎంతమేర ఫలిస్తుందో…

Also Read: పీచేముడ్.. ఢిల్లీ నుంచి ఉత్తి చేతులతో తెలంగాణ మంత్రులు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular