Nandamuri Balakrishna: ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కేటాయించాడు. అయితే, ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా ఫిక్స్ చేశాడు బాలయ్య.

ఇప్పటికే అనిల్ కూడా ఎఫ్ 3 సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం అనిల్ జనవరి నుంచి బాలయ్య సినిమా పైకి రానున్నాడు. ఎలాగూ స్క్రిప్ట్ కూడా అయిపోయింది. కాబట్టి బాలయ్య డేట్లు ఇస్తే షూట్ చేసేద్దాం అనే కోణంలో అనిల్ ఉన్నాడు. కానీ, అనిల్ కి బాలయ్య ఇప్పుడు డేట్లు ఇచ్చే పొజిషన్ లో లేడు. గోపీచంద్ మలినేని సినిమాకి కంటిన్యూగా డేట్లు ఇచ్చాడు. సో.. బాలయ్య కోసం అనిల్ రావిపూడి కనీసం నాలుగైదు నెలల పాటు వెయిట్ చేయక తప్పదు.
ఇప్పటికే బాలయ్యకి అనిల్ తన కథని చెప్పి ఓకే కూడా చేయించుకున్నాడు. కథ ఓకే చేయించుకున్న తర్వాత కూడా దాదాపు ఆరు, ఏడు నెలలు ఖాళీగా ఉంటూ బాలయ్య డేట్లు కోసం వెయిట్ చేయాలి అంటే.. ఒక స్టార్ డైరెక్టర్ కి కష్టమైన పనే. పైగా అనిల్ రావిపూడికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
Also Read: ‘రాధేశ్యామ్’ స్థాయిని కావాలనే తగ్గించారు !
అయితే, ఈ అంశం పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కోసం ఎన్ని నెలలు అయినా వెయిట్ చేస్తాను అంటూ అనిల్ స్ఫష్టం చేశాడు. ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. నిజానికి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు అసలు రేంజ్ లేదు అని అఖండ ముందు వరకూ కొంతమంది కామెంట్స్ చేసేవారు.
అయితే, ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. అదే పుష్పకి కలిసి వచ్చినట్లు.. టికెట్ రేట్లును రెండు వందలకు, ఐదు వందలకు అమ్ముకుని ఉండి ఉంటే.. బాలయ్య 200 కోట్ల మార్క్ ను కూడా దాటేవాడేమో. ఇక నుంచి బాలయ్య ఎక్కువ యాక్షన్ ఆశిస్తారు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లేలో యాక్షన్ ను ఫుల్ గా దట్టించాల్సి ఉంది.
Also Read: ‘రాజమౌళి’కి ఉన్న క్లారిటీ అమోహం !