Homeజాతీయ వార్తలుHyderabad : హైదరాబాద్ లో ఒక్క రోజులో తిరిగే పర్యాటక ప్రదేశాలు ఏవో తెలుసా?

Hyderabad : హైదరాబాద్ లో ఒక్క రోజులో తిరిగే పర్యాటక ప్రదేశాలు ఏవో తెలుసా?

Hyderabad : ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం, వ్యాపారం కారణంగా నిత్యం విజయ వాతావరణంలో ఉంటారు చాలామంది. ఈ క్రమంలో నిత్యం ఒత్తిడితో కలిగి ఉంటారు. అయితే కార్యాలయాల్లో పని చేసేవారు లేదా ఇతరులు వారంలో ఒకరోజు సెలవులు తీసుకుంటారు. కానీ విహారయాత్రలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. అయితే కుదుర ప్రయాణం చేయడానికి అనువైన సమయం ఉండదు. అయితే ఒకటి లేదా రెండు రోజులపాటు సెలవులు తీసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇలా అతి కొద్ది రోజుల్లో ప్రయాణం చేయడానికి అనువైన ప్లేస్ ల కోసం వెతుకుతూ ఉంటారు. హైదరాబాదులో ఉండే వారికి దగ్గర్లోనే ఎంజాయ్ చేసే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాదులో ఒకరోజు మొత్తం స్పెండ్ చేయడానికి గోల్కొండ కోట చాలా అణువుగా ఉంటుంది. 14 శతాబ్దంలో నిర్మించిన ఈ కోట హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి నగరం నుంచి ఎన్నో రకాల బస్సులు ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి ఒకే వాహనంలో వెళ్లాలంటే ప్రత్యేక వాహనం తీసుకొని వెళ్లవచ్చు. పిక్నిక్ లాగా ఒక రోజు మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.

Also Read : మిస్ వరల్డ్ పోటీలు: హైదరాబాద్‌కు అందాల భామలు

దేశంలోని అతిపెద్ద మ్యూజియాలలో హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియం ఒకటి. ఇది dar ur pisha లో ఉంది. ఇందులో దేశానికి సంబంధించిన వస్తువులతో పాటు జపాన్, నేపాల్, పర్షియా, ఉత్తర అమెరికా వంటి దేశాలకు సంబంధించిన అనేక విలువైన వస్తువులు ఇందులో ఉన్నాయి. చిన్నపిల్లలతో కలిసి మ్యూజియంకు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ఒకరోజు మొత్తంవిహారయాత్రకు వెళ్లి ఉల్లాసంగా గడపవచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయబడిన ఈ ఫిలిం సిటీ లో సినిమా షూటింగ్లో అన్ని జరుగుతూ ఉంటాయి. సినిమాలో చూపించే సీన్స్ రియల్ గా చూడాలని అనుకునేవారు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యం ఉంటుంది.. కొన్ని ప్యాకేజీల ద్వారా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు.

చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే స్నో వరల్డ్ హైదరాబాద్ లో కొలువై ఉంది. హుస్సేన్ సాగర్ కు దగ్గర్లోనే ఉన్న ఇది దాదాపు 20 టన్నుల మంచుతో తయారుచేసి ఉంటుంది. ఇందులోకి పిల్లలు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. హుస్సేన్ సాగర్ దగ్గర్లోకి వెళ్లినవారు స్నో వరల్డ్ కు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.

హుస్సేన్ సాగర్ కు దగ్గర్లోనే ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ రకరకాలుగా ఆకర్షించే బొమ్మలే ఉన్నాయి. 150 రకాల మొక్కల జాతులు ఇక్కడ చూడవచ్చు. పిల్లలతో పాటు పెద్దవారు కూడా ఉల్లాసంగా గడపడానికి ఎన్టీఆర్ గార్డెన్ అనువైన ప్రదేశం. అలాగే ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒకరోజు మొత్తం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version