
జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల మంగళగిరి పర్యటనలో బిజీబిజీగా పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అమరావతి రైతులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ముందస్తు జమిలీ ఎన్నికలపై అనూహ్యమైన ప్రకటన చేశారు.
Also Read: జీహెచ్‌ఎంసీలో జనసేనకు ఓట్లు రాలేనా?
దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలని తన వ్యక్తిగత అభిప్రాయమని.. చాలా రాష్ట్రాలు ఇదే కోరుకుంటున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. ముందుగా ఎన్నికలు రావాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటాయి.. అది సహజమే. కానీ.. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలు ఇలాంటి ప్రకటనలు చేస్తే ఆసక్తికరమే కదా. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోది. ఒకే దేశం.. ఒకే విధానం.. బీజేపీ కాన్సెప్ట్. ఈ నినాదంతో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి 2022లోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది.
2022లో జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనకు ఓ ప్రాతిపదిక ఉంది. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2021లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందంటున్నారు.
Also Read: సెంటిమెంట్ తో కొడుతున్న కేటీఆర్.. వర్కవుట్ అవుద్దా?
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇటీవల జమిలీ ఎన్నికలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరో రెండేళ్లలోనే జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని పార్టీ క్యాడర్‌కు పదే పదే చెబుతున్నారు. ఆ మేరకు ఆయన రాజకీయ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా.. బీజేపీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు మళ్లీ జమిలీ ఎన్నికల వ్యూహాల దిశగా వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించేలా చేశాయి. ఇటీవలి కాలంలో ఈ విషయంలో చంద్రబాబు కూడా క్లారిటీకి వచ్చారు. జమిలీ ఖాయమని అంచనాకు వచ్చారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్న పవన్ కల్యాణే ఈ మాటలు చెప్పారంటే.. జమిలీ ఎన్నికలపై ఆయనకు సమాచారం ఉన్నట్లేనని అర్థం చేసుకోక తప్పదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్