Homeజాతీయ వార్తలుBandla Ganesh- KCR: కేసీఆర్‌పై సడెన్‌గా బండ్ల గణేశ్‌కు జ్ఞానోదయం ఎలా అయ్యింది!

Bandla Ganesh- KCR: కేసీఆర్‌పై సడెన్‌గా బండ్ల గణేశ్‌కు జ్ఞానోదయం ఎలా అయ్యింది!

Bandla Ganesh- KCR
Bandla Ganesh

Bandla Ganesh- KCR: బండ్ల గణేశ్.. ఈ పేరే ఒక బ్రాండ్‌. కాదు కాదు ఫైర్‌ బ్రాండ్‌. తన మాటల తూటాలతో జనం మదిలో అలా ఫిక్స్‌ అయిపోయారు బండ్ల గణేశ్‌. ఆయన చేతికి మైక్‌ ఇస్తే ఆ మాటల సునామీకి అంతే ఉండదు. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో హైలైట్‌ అవుతుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా తన మార్క్‌ చూపించిన బండ్ల గణే శ్‌.. రాజకీయ రంగంలో కూడా హైలైట్‌ అయ్యారు. రాజకీయ కోణంలో ఆయన చెప్పే మాటలు హాట్‌ ఇష్యూ అయిన సందర్భాలు బోలెడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన బండ్ల గణేశ్‌ సంచల కామెంట్స్‌ చేశారు.

Also Read: Jagan Stickers: ఏపీలో స్టిక్కర్ రాజకీయాలు .. చెరిగిపోతే పచ్చబొట్లు వేస్తారేమో

దేశాన్ని నడిపించే సత్తా ఉంది..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్లల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతంగా ముందుకు నడిపించే సత్తా ఉందని బండ్ల గణేశ్‌ అన్నారు. కేసీఆర్‌ పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం చూశాక తనకు ఆ నమ్మకం కలిగిందని ట్వీట్‌ చేశాడు బండ్లన్న. ఈ ట్వీట్‌ను తెలంగాణ సీఎంవోకు ట్యాగ్‌ చేశాడు. ‘ఎన్నో రోజుల నుంచి శ్రీనరసింహస్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారిఇ అనుగ్రహం లేక నాకు రావడం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని రాసుకొచ్చారు. బండ్ల గణేశ్‌ పోస్టును చాలామంది రీట్వీట్‌ చేస్తున్నారు. కామెంట్లు పెడతున్నారు. దటీజ్‌ కేసీఆర్‌ అని కొందరు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కొందరు, జయహో కేసీఆర్‌.. జై తెలంగాణ అని మరికొందరు, యత్‌భావం తద్భవతి అని ఇంకొందరు కామెంట్‌ పెట్టారు.

7 ఓ క్లాక్‌ బ్లేడ్‌ ఇష్యూతో చర్చల్లో..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌ గా పని చేసిన బండ్ల గణేశ్‌.. అదే సమయంలో 7’0 క్లాక్‌ బ్లేడ్‌ ఇష్యూతో చర్చల్లో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ గెలవకపోతే సెవెన్‌ ఓ క్లాక్‌ బ్లేడ్‌ తో గొంతు కోసుకుంటా అని చెప్పి అలజడి సృష్టించాడు బండ్లన్న. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ యూటర్న్‌ తీసుకున్నారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా..
ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియా వేదికగా ఆయన పెడుతున్న పోస్టులు జనాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు చెబుతూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టారు బండ్ల గణేశ్‌. రాజకీయాలకు బై బై అంటూ ఆయన పెట్టిన ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయింది. అయితే తాజా పోస్టులు బండ్లన్న తిరిగి పొలిటికల్‌ జర్నీ ప్రారంభించబోతున్నారా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

గతంలో బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం..
బండ్ల గణేశ్‌ గతంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఈ తరుణంలో బండ్ల గణేశ్‌ కూడా కమలం గూటికి చేరుతారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సినీ గ్లామర్‌ కోసం పరితపిస్తుంది. బండ్ల గణేశ్‌ వస్తే స్వాగతిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఏదీ జరుగలేదు.

Bandla Ganesh- KCR
Bandla Ganesh- KCR

పవన్‌ అడుగుజాడల్లో
2018లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవి చూసిన తర్వాత సైలెంట్‌ అయిన బండ్ల గణేశ్‌ అసలు రాజకీయంగా తనకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదు అని చాలాసార్లు చెప్పారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ పార్టీ జనసేనతో పొలిటికల్‌ రీ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ బీజేపీతో కలిసి పనిచేస్తుండడంతో ఆయన అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నారని ప్రచారం జరిగింది.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు రాజకీయాల్లోల తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌పై బండ్లన్నకు జ్ఞానోదయం అందుకే కలిగినట్లుంది అని పాలిటికల్‌ సెటైర్స్‌ మొదలయ్యాయి.

Also Read: Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చేశారు.. జగన్ పాలనలో అంతే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version