Toddler abandoned on highway: ఉగ్రవాదులు ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. ఆ సమయంలో సాటి మనుషుల ప్రాణాలను లెక్కపెట్టరు. తమ లక్ష్యం నెరవేరడం వారికి ముఖ్యం. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతటి దారుణాల కైనా సరే పాల్పడుతుంటారు. తీవ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దానికోసం ఎంతటి హింసాత్మక ఘటనల కైనా సరే పాల్పడుతుంటారు. విధ్వంసాన్ని.. వినాశనాన్ని ఏకకాలంలో చూపిస్తారు.
ఉగ్రవాదులకు ఒక లక్ష్యం ఉంటుంది. తీవ్రవాదులకు కూడా తమ ఉనికిని చాటుకోవాలనే తాపత్రయం ఉంటుంది. వీరిని ఎవరు కూడా మనుషులని అనరు. ఎందుకంటే వీళ్లలో మానవత్వం ఉండదు. సాటి మనిషి మీద ప్రేమ ఉండదు. కరుణ, జాలి, ఆప్యాయత అనే పదాలకు వీరికి అర్థం తెలియదు. వీరిలో నిత్యం చాందసవాదం.. మూర్ఖత్వం కలగసి ఉంటాయి. అలాంటప్పుడు వీరి నుంచి మానవత్వాన్ని ఆశించడం శుద్ధ దండగ. కానీ ఈ కథనంలో మీరు చదవబోయే ఆ వ్యక్తులు ఉగ్రవాదుల కంటే దారుణం.. తీవ్రవాదుల కంటే హీనం.
మధ్యప్రదేశ్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా సంవత్సరాల క్రితం పెళ్లయింది. పిల్లలు మాత్రం కాలేదు. అనేక ఆసుపత్రులు తిరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వారు అనాధ ఆశ్రమాన్ని ఆశ్రయించారు. అందులో ఓ బాలిక వారికి నచ్చింది. వెంటనే ఆమెను దత్తత తీసుకున్నారు.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ .. ఆ తర్వాతే వారిలో ఉన్న అసలు మూర్ఖత్వం బయటపడింది.
ఆ పాపను దత్తత తీసుకున్న తర్వాత వారి వ్యాపారంలో నష్టం రావడం మొదలుపెట్టింది. నష్టాల వల్ల వారి వ్యాపారం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో వారు తాము పెంచుకుంటున్న పాపను రోడ్డుమీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు.. అత్యంత అనాగరికమైన ఈ చర్య సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసింది. ఆ పాప ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు చేరదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివరాలు తెలుసుకుంటే.. జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆ పాపను చట్ట ప్రకారం వారు దత్తత తీసుకోలేదు. ప్రభుత్వపరంగా నిబంధనలు పాటించలేదు.. ఇప్పుడు ఆ పాప ఓ ఆశ్రమంలో పెరుగుతోంది. ఆ పాపను అలా నడిరోడ్డు మీద వదిలేసినందుకు పోలీసులు వారి మీద కేసులు నమోదు చేశారు.