Homeజాతీయ వార్తలుAtal Bihari Vajpayee: నాడు వాజ్ పేయి తెగింపునకు నిలువెత్తు రూపమే నేటి శక్తివంతమైన భారత్

Atal Bihari Vajpayee: నాడు వాజ్ పేయి తెగింపునకు నిలువెత్తు రూపమే నేటి శక్తివంతమైన భారత్

Atal Bihari Vajpayee: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోంది.. రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇలాంటి సందర్భంలో రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. అది కూడా మన రూపాయల్లోనే చెల్లింపులు చేపడుతున్నాం.. అన్ని దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ ఇది ఎలా సాధ్యం? కానీ సాధ్యమైంది.. దీనిపై మిగతా దేశాలు భారత్ ను వేలెత్తి చూపే అవకాశం లేకుండా పోయింది.. ఇందుకు కారణం మన దేశ విదేశాంగ విధానం.. మన దేశం అత్యంత శక్తివంతంగా మారటం.. ఆమధ్య నుపుర్ శర్మ వ్యాఖ్యల వల్ల అరబ్ దేశాలు నానా యాగి చేయాలని చూశాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనపై నిరసన వ్యక్తం చేశాయి.. కానీ ఒక్క రోజులోనే సీన్ మారింది. ఇందుకు కారణం మన దేశ విదేశాంగ విధానం. కానీ ఇదంతా ఒక్కరోజులోనే జరగలేదు. దీని వెనుక చాలా చరిత్ర ఉంది.

Atal Bihari Vajpayee
Atal Bihari Vajpayee

ఏబీ వాజ్ పేయి భారత ప్రధానిగా ఉన్న రోజులవి.. భారతదేశం కలిగిన విదేశాంగ విధానం అనుసరిస్తున్న రోజులు కూడా అవే.. అప్పట్లో మనం అమెరికాకు భయపడేవాళ్ళం.. అది ఏం చెప్తే అది చేసేవాళ్ళం.. అలాగని మనకు అమెరికా సహాయం చేసేది కాదు.. మన అలిన విదేశాంగ విధానం ద్వారా రష్యాపై కొద్దో గొప్పో ఆధారపడేవాళ్ళం.. రష్యా అంటే అమెరికాకు గిట్టదు కాబట్టి.. మనల్ని ఇబ్బంది పెట్టేది.. ఒకవేళ మనం అమెరికా వైపు వెళ్లినా రష్యా కు నచ్చేది కాదు.. దీనికి తోడు పాకిస్తాన్ కు సహాయం చేసి కాశ్మీర్ విషయంలో మనల్ని తరచూ ఇబ్బంది పెట్టేది.. ఇలాంటి సమయంలో సంకీర్ణ ప్రభుత్వం ఆయనప్పటికీ వాజ్ పేయి హయాంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.. రాజస్థాన్ సమీపంలోని పోఖ్రాన్ సమీపంలో అణ్వస్త్రాలు ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా, రష్యా భారత్ పై గుడ్లు ఉరమడం ప్రారంభించాయి. ఈ సమయంలో అప్పటి భారత ప్రధాని వాజ్ పేయి.. మేం అలీన విదేశాంగ విధానాల నుంచి దూరం జరుగుతున్నామని, మళ్లీ అణ్వస్త్ర దేశంగా ప్రకటించాలని కోరారు. మా దేశంపై ఆంక్షలు విధించే ముందు… ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ ఎవరిదో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అమెరికా పాకిస్తాన్ కు సహాయం చేయడాన్ని నిలిపివేసింది.

Atal Bihari Vajpayee
Atal Bihari Vajpayee

తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ఆ సమయంలో అమెరికా పాకిస్తాన్ కు సహాయం చేయడాన్ని ప్రారంభించింది. దీనివల్ల భారత్ కు కాశ్మీర్ విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయి.. నెహ్రు హయాంలో ప్రారంభించిన అలీన విదేశాంగ విధానాన్ని భారత్ మళ్ళీ ప్రారంభించింది .. ఇదే అదునుగా అమెరికా అణు బిల్లును ఆమోదింప చేయాలని భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పట్లో ఇది ఉభయ సభల్లో ఆందోళనకు కారణమైంది. ఈలోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి బిజెపి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత విదేశాంగ విధానంలో సమూల మార్పులు వచ్చాయి. సుష్మ స్వరాజ్ మరణం అనంతరం జై శంకర్ విదేశాంగ మంత్రి అయ్యారు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేశారు.. ఫలితంగా భారత్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది.. భారత్ ఒత్తిడి మేరకు అమెరికా పాకిస్తాన్ కు సహాయం చేయడాన్ని నిలిపివేసింది.. దీనికి తోడు రష్యా భారతదేశానికి మరింత చేరువైంది.. మరోవైపు భారత్ అన్ని రూపాల్లో దారులను మూసివేయడంతో పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నది. కనీసం విద్యుత్ సరఫరా కూడా ఆ దేశంలో లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలిన విధానమని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవాళ భారత్ అన్ని దేశాలకు భయపడాల్సి వచ్చేది.. నాడు అటల్ బిహారీ వాజ్పేయి బలమైన అడుగులు వేయడం… నేడు నరేంద్ర మోడీ దానిని కొనసాగించడం.. వల్ల భారత్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version