Movie Ticket Rates: ఇప్పుడు ఏపీలో టాలీవుడ్ వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. టికెట్ రేట్ల విషయంలో తగ్గేదే లే అన్నట్టు ప్రభుత్వం ఉంది. ఇక మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చేసింది. జీవో నెం.35ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బాధ్యత తీసుకుంటూ వెంటనే విచారణ జరపించాలంటూ పిల్ కూడా వేశారు.
జీవో రద్దు విషయంపై విచారణ వెంటనే స్టార్ట్ చేయాలని లేకుంటే విడుదలకు రెడీగా ఉన్న సినిమాల టికెట్ల రేట్లు పెంచుకుని అమ్మేసుకుంటారని ఆయన చెప్పడం గమనార్హం. ఇక రెండు రోజుల్లో పాన్ ఇండియా మూవీ పుష్ప రిలీజ్ కాబోతోంది. కానీ కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల పుష్ప టికెట్లు ఇంకా బుకింగ్ స్టార్ట్ చేయలేదు. జీవోను రద్దు చేస్తే రేట్లు పెంచుకుని అమ్మేయాలని డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పట్టు విడవట్లేదు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తే వెంటనే దాన్ని సవాల్ చేయడం చాలా అరుదుగానే జరుగుతుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఇలాంటిదే జరుగుతోంది. అయితే డివిజన్ బెంచ్‌లో జీవో మీద ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పిటిషన్ మీద విచారణను గురువారంకు వాయిదా వేసింది బెంచ్. ఇక గురువారం నాడు ఫస్ట్ కేసుగా అడ్వకేట్ జనరల్ వేసిన పిటిషన్‌ను విచారించనున్నారు.
Also Read: Chandrababu Pawan: చంద్రబాబు, పవన్ మళ్లీ కలవబోతున్నారోచ్!
ఇక్కడ గనక సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇస్తే మాత్రం జగన్ సర్కార్ పంతం నెగ్గినట్టే అవుతుంది. కానీ డివిజన్ బెంచ్ ఒకవేళ సింగిల్ బెంచ్ తీర్పుకే మద్దతు తెలిపితే మాత్రం జగన్ సర్కార్ పంతానికి పోయి పరువు తీసుకున్నట్టు అవుతుంది. ఇది టాలీవుడ్‌కు బాగా కలిసి వస్తుంది. అంటే ఈ తీర్పు అటు టాలీవుడ్ కంటే జగన్ సర్కారు ప్రతిష్టను ఎత్తి చూపుతుందన్న మాట. మరి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి.
Also Read: Chandrababu: ఆ మాజీ న్యాయమూర్తులు జగన్ కు అందుకే సపోర్టు చేశారట.. ఇదేం న్యాయం చంద్రబాబూ?