https://oktelugu.com/

Brahmastra: రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ నటిస్తున్న “బ్రహ్మస్త్ర” మోషన్ పోస్టర్ రిలీజ్ …

Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 10:15 AM IST
    Follow us on

    Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరూత్సాహపడ్డారు.

    Brahmastra

    Also Read: వివాదాస్ప‌ద హీరోయిన్ నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

    అయితే షూటింగ్‌ వేగవంతం చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే… ‘ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది సామాన్యుల ఊహకు సైతం అందనిది అది… అత్యంత పురాతన శక్తి. అదో అస్త్రం… అదేంటి అనే వచ్చే డైలాగ్‌ క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా తొలి భాగాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అద్భుతంగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ పై మీరూ ఓసారి లుక్కేయండి.

    https://twitter.com/aliaa08/status/1471106564790517761?s=20

    Also Read: ఆ డైరక్టర్​కి కోపమొస్తే నన్ను కొట్టేవారు- రణబీర్​