దేశంలో ఆగని మహమ్మారి పోకడ!

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న 2,553 కరోనా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,875 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోన కేసుల సంఖ్య 46711కు చేరింది. ఈ స్థాయిల కొత్త కేసులు నమోదైతే… మరికొద్ది గంటల్లోనే కేసుల సంఖ్య 50 వేలకు చేరే అవకాశం ఉంది. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా 194 మంది […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 6:28 pm
Follow us on


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న 2,553 కరోనా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,875 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోన కేసుల సంఖ్య 46711కు చేరింది. ఈ స్థాయిల కొత్త కేసులు నమోదైతే… మరికొద్ది గంటల్లోనే కేసుల సంఖ్య 50 వేలకు చేరే అవకాశం ఉంది. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా 194 మంది చనిపోగా… 1020 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 1583 మంది చనిపోగా, మొత్తం 13160 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 27.41గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కొన్ని రాష్ట్రాల నుంచి సరైనా సమయానికి కేసులకు సంబంధించిన వివరాలు, మరణాలకు సంబంధించిన వివరాలు రావడం లేదని ఆయన అన్నారు.

ఇతర రోగాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలను కొనసాగించాల్సిన అవసరం ఉందని… అత్యవసర కేసులకు ఎలాంటి ఆటంకం కలిగించుకుండా చూడాలని అన్నారు.