https://oktelugu.com/

బెయిల్ కోసం సుప్రీంకు.. వదలని రఘురామ

సీఐడీ సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం.. 14 రోజుల రిమాండ్ విధించడంతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు సుప్రీంకోర్టు గడపతొక్కాడు. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ రఘురామను గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరుచగా జడ్జీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈనెల 28వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. […]

Written By: , Updated On : May 16, 2021 / 09:05 AM IST
Follow us on

సీఐడీ సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం.. 14 రోజుల రిమాండ్ విధించడంతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు సుప్రీంకోర్టు గడపతొక్కాడు. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎంపీ రఘురామను గుంటూరులోని సీఐడీ కోర్టులో హాజరుపరుచగా జడ్జీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈనెల 28వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఆయన కాళ్లపై గాయాలు ఉండడంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశించింది. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉండొచ్చని తెలిపింది. ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు వై.కేటగిరి భద్రత కొనసాగుతుందని తెలిపింది.

ప్రస్తుతం ఆయనను గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు గాలి గాయాలపై మెడికల్ బోర్డు 18 రకాల వైద్యపరీక్షలు చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. రాత్రంతా రఘురామకు ఈ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యుల కమిటీ రఘురామ శరీరంపై గాయాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఇక ఈ వ్యవహారాన్ని సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకు బెయిల్ వస్తుందా? రాదా అన్నది తేలాల్సి ఉంది.