కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. దేశమంతా దాని ధాటికి అతలాకుతలం అయిపోతున్నారు. సామాన్య ప్రజలే సమిధలవుతున్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా రక్కసిపై జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. ఫలితంగా జనం అల్లాడుతున్నారు. వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు. అత్యాధునిక సదుపాయాలు కరువై భయాందోళన చెందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.
బి క్లాస్ టౌన్ లే..
ఆంధ్రలో వైద్య సదుపాయాలు ఉన్న ఆస్పత్రులు తక్కువే. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖ, కాకినాడ తప్పితే అన్ని బిక్లాస్ కేటగిరీలో ఉన్న పట్టణాలే కనిపిస్తాయి. ఇక్కడ వైద్య సదుపాయాలు కరువై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ పుణ్యమా అని ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. దీంతో ఆస్పత్రులు కరువై వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మనకు హైదరాబాద్ లాంటి నగరం ఉంటే బాగుండు అనే విషయం అందరిలోనూ వినిపిస్తోంది.
జగన్ ముందుచూపు
ఏపీ సీఎం జగన్ ముందుగానే ఊహించి వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని భావించారు. అన్ని జిల్లా, పార్లమెంట్ కేంద్రాల్లో మెడికల్ కళాశాలల స్థాపనకు ప్రతిపాదనలు చేశారు. కానీ బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక్కో కళాశాలకు సుమారు మూడు వందల కోట్ల పైనే అవుతుందని తెలుసుకుని కాస్త నెమ్మదించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై దృష్టి
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఇరవై నాలుగు గంటలు పీహెచ్ సీలు తెరిచే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వాటి అమలు ఇంకా సాధ్యం కావడం లేదు. వైద్య సదుపాయాల కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. వైద్య సదుపాయాలు ఉన్న నగరాల వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ఎక్కువ మంది చూపు హైదరాబాద్ నగరంపైనే ఉంది. దీంతో కొవిడ్ బాధితులు అత్యాధునిక వైద్య సదుపాయాలున్న భాగ్యనగరం వైపే మొగ్గు చూపుతున్నారు.