జగన్ జవసత్వాలు ఆ రెండు రత్నాలే

విజయాల ఊపులో వైసీపీ కనిపిస్తోంది. అపజయాల మూట టీడీపీ నెత్తిన పెట్టుకుంటోంది. ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని గర్వంగా వైసీపీనేతలు చెబుతున్నారు. మా పరిపాలన విధానాలే మాకు శ్రీరామరక్ష అని పదే పదే కీర్తిస్తున్నారు. దీంతో రాష్ర్టంలో వైసీపీకి ఉన్న బలమేంటో తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలే దానికి విజయాల మార్గం సుగమం చేస్తున్నాయని ఘంటాపథంగా వల్లిస్తున్నారు. ఆ రెండు పథకాలే.. ఏపీలో ప్రభుత్వ పథకాల్లో పింఛన్లు, అమ్మ ఒడి ప్రధానమైనవి. వీటితోనే ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : May 16, 2021 9:06 am
Follow us on

విజయాల ఊపులో వైసీపీ కనిపిస్తోంది. అపజయాల మూట టీడీపీ నెత్తిన పెట్టుకుంటోంది. ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని గర్వంగా వైసీపీనేతలు చెబుతున్నారు. మా పరిపాలన విధానాలే మాకు శ్రీరామరక్ష అని పదే పదే కీర్తిస్తున్నారు. దీంతో రాష్ర్టంలో వైసీపీకి ఉన్న బలమేంటో తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలే దానికి విజయాల మార్గం సుగమం చేస్తున్నాయని ఘంటాపథంగా వల్లిస్తున్నారు.

ఆ రెండు పథకాలే..
ఏపీలో ప్రభుత్వ పథకాల్లో పింఛన్లు, అమ్మ ఒడి ప్రధానమైనవి. వీటితోనే ప్రభుత్వం తన విజయఢంకా మోగిస్తోంది. గతంలో సైతం పింఛన్లు ఉన్నా ప్రస్తుతం ఇంటికి వెళ్లి పింఛన్ అందజేయడంతో వారి కష్టాలు దూరమయ్యాయి. ఇన్నాళ్లు పింఛన్ కోసం వెళితే ఎప్పుడొస్తారో తెలియదు. కానీ ప్రస్తుతం ఉదయం ఐదు గంటలకే ఇంటికి వచ్చి మరీ పింఛన్ అందజేయడంతో వృద్ధులు, వికలాంగులు, మహిళలు సంతోషపడుతున్నారు. ఇంకో పథకం అమ్మ ఒడి. ప్రతి మహిళకు జనవరిలో రూ.15 వేలు ఖాతాలో వేస్తున్నారు. దీంతో మహిళల ఆదరణ పొందుతున్నారు. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు వైసీపీకి చేరువవుతున్నారు. ఈ రెండు పథకాలతోనే వైసీపీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటోంది. రానురాను ఈ పథకాల్లో మరిన్ని మార్పులు తెచ్చి ప్రజల్లో ఆదరణ మరింత పెంచుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే టీడీపీకి సైతం విజయం కష్టసాధ్యమేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజలకు చేరువ
వైసీపీ నేతలు ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజామోద పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ప్రజల్లో తమ పార్టీ విధేయతను చూపుతుందని చెప్పకనే చెబుతున్నారు. ఏ కష్టమొచ్చినా మేమున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తమ పార్టీ విజయఢంకా మోగించేందుకు కావాల్సిన విధి విధానాలు, రూపకల్పనలపై చొరవ చూపుతున్నారు. రాబోయే కాలంలో విజయం నల్లేరుపై నడకలా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారు.

జగన్ పై ధీమాతోనే..
ఏపీ ప్రజలు సీఎం జగన్ అందిస్తున్న పథకాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా అందించే పథకాలతో తమ జీవన విధానం మెరుగుపడుతుందని భావించి వైసీపీకి ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం పనితీరే ప్రామాణికంగా ప్రజలు ఓట్లు వేస్తున్నారని చెబుతున్నారు. దీంతో విజయం సులభంగా సాధ్యమవుతుందని ధీమాగా ఉన్నారు. ఈ పథకాలే ప్రభుత్వంపై విశ్వాసం పెంచుతున్నాయి. అందుకే ప్రజలు వైసీపీని ఎన్నికల్లో గెలిపిస్తున్నారని ప్రగాఢ విశ్వాసం.