https://oktelugu.com/

ఢిల్లీకి చేరిన దీదీ పంచాయితీ..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ.. అధికార పార్టీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రత్యర్థిగా మారిన తరువాత రూట్ మార్చుకున్న మమతా బెనర్జీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. బెంగాల్ అడబిడ్డగా చెప్పకునే మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనేందుకు సింపతీ పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని బదిలీ చేసింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 01:54 PM IST
    Follow us on


    ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ.. అధికార పార్టీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రత్యర్థిగా మారిన తరువాత రూట్ మార్చుకున్న మమతా బెనర్జీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. బెంగాల్ అడబిడ్డగా చెప్పకునే మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనేందుకు సింపతీ పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని బదిలీ చేసింది. తరువాత మమతపై జరగడంతో డీజీపీని మార్చడం వల్లే ఈ ఘటన జరిగినట్లు టీఎంసీ ప్రజల్లో ప్రచారం చేస్తోంది.

    Also Read: నాగపూర్ లాక్ డౌన్.. పొంచి ఉన్న ముప్పు

    తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఆమె ప్రత్యర్థిగా మారిన సువేందు అధికారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దాడికి ముందు మేనిఫెస్టోను గురువారం విడుదల చేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. కానీ దీదీకి అయిన గాయం కారణంగా ఎన్నికల మేనిఫెస్టో వాయిదా పడినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీకి చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె ఎడమ చీలమండకు తీవ్రగాయమైందని, చాతినొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ఆమె కుడి బుజం, కుడి ముంజేయి, మెడకు గాయమైందని తెలిపారు.

    దీంతో పశ్చిమ బెంగాల్ పాలక టీఎంసీ గురువారం తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసుకుంది. మేనిఫెస్టోను విడుదల చేస్తే.. మమతా మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆమెపై దాడి జరగడం కారణంగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె కోలుకునే వరకు మేనిఫెస్టోలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పశ్చిమ బెంగాల్ లో తన అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది.

    Also Read: ప్రపంచం చూపు.. క్వాడ్ వైపు

    అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ సోషల్ మీడియా వేదికగా.. తన సందేశాన్ని పంపుతున్నారు. బలమైన గాయాలు అయినా.. రెండు మూడు రోజుల్లో కోలుకుని.. ప్రచారంలో పాల్గొంటానని చెబుతున్నారు. ఇక దీదీపై దాడి ఘటనపై సీరియస్ గా ఉన్న టీఎంసీ నేతలు నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లజెండాలతో మౌనదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీకి వెళ్లిన టీఎంసీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మమతాపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేయనున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్