https://oktelugu.com/

’విజయ డెయిరీ‘ ఆస్తులు పంపిణీ.. ఏపీకి అది సాధ్యమేనా..?

రాష్ట్రాల పునర్ విభజనలో భాగంగా దాదాపు ఆస్తులను పంచేసుకుంటున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తాజాగా విజయా డెయిరీ ఆస్తులను కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఉత్పన్నమైన పలు సమస్యల కారణంగా చాలాసార్లు అది సాధ్యం కాకపోయింది. తాజాగా హైదరాబాదులోని విజయా డెయిరీ ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తెలంగాణ హై కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే ఇది ఏపీకి ఆశావహంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక్క విజయా డైరీ మాత్రమే కాదు.. ఉమ్మడి సంస్థల ఆస్తులు అత్యధికంగా హైదరాబాదులోనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 02:08 PM IST
    Follow us on


    రాష్ట్రాల పునర్ విభజనలో భాగంగా దాదాపు ఆస్తులను పంచేసుకుంటున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తాజాగా విజయా డెయిరీ ఆస్తులను కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఉత్పన్నమైన పలు సమస్యల కారణంగా చాలాసార్లు అది సాధ్యం కాకపోయింది. తాజాగా హైదరాబాదులోని విజయా డెయిరీ ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తెలంగాణ హై కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే ఇది ఏపీకి ఆశావహంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక్క విజయా డైరీ మాత్రమే కాదు.. ఉమ్మడి సంస్థల ఆస్తులు అత్యధికంగా హైదరాబాదులోనే ఉన్నాయి. అవన్నీ తమవేనని తెలంతాణ వాదిస్తోంది. కానీ ఏపీ సర్కారు మాత్రం.. జనాభా ప్రాతిపదికన పంచాలని అంటోంది.

    Also Read: సవాల్ కు సై.. రఘురామ రియాక్షన్..

    ఈ పీఠముడి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కొనసాగుతోంది. ఉమ్మడి ఏపీ విభజన తరువాత.. రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తులపై వివాదం కొనసాగుతోంది. కేంద్ర ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పును రకరకాల కారణాలతో తెలంగాణ సర్కారు అమలు చేయడం లేదు. అదే తీర్పును మిగితా ఉమ్మడి ఆస్తులకు కూడా వర్తింపజేయాలని ఏపీ సర్కారు కోరుతోంది.

    తెలంగాణ సర్కారు మాత్రం విభజన చట్టంలో ఉన్న సెక్షన్లకు సొంతగా అర్థం చెప్పుకుని ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రాలకే అనే వాదన వినిపిస్తోంది. దాంతో ఆస్తుల పంపకం నిలిచిపోయింది. విభజన అంసపూర్ణంగా ఆగిపోయింది. టీడీనీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. ఆ ఆస్తుల పంపకాలపై చాలా వివాదాలు జరిగాయి. మంత్రలు కమిటీలను నియమించి గవర్నర్ కూడా చర్చలు జరిపారు. అయితే అప్పటి గవర్నర్ కేవలం సెక్రటేరియట్ భవనాలను తెలంగాణకు అప్పగించే వ్యూహంతోనే చర్చలు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. అవీ ఫలించకపోవడంతో.. కోర్టులో కేసులు దాఖలు అయ్యాయి. ఏపీలో సర్కారు మారిన తరువాత రావల్సిన ఉమ్మడి ఆస్తులపై దృష్టి సారించలేదు.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ‘ఉక్కు’ మంత్రం

    కరెంటు బకాయిలు ఐదువేల కోట్లు రావాల్సి ఉన్నా…ఒక్కసారి కూడా అడగలేదు. గత ప్రభత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా ఫిటిషన్ కూడా వేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు పంచడానికి తెలంగాణ సర్కారు ఆసక్తి చూపడం లేదు. కోర్టు తీర్పునిచ్చినా.. ఏదో ఒక రకంగా అడ్డుకుంటోంది. ఇప్పుడు న్యాయం ఏపీ సర్కారు వైపున ఉంది. మరి ఈ న్యాయాన్ని అందిపుచ్చుకుని రావాల్సిన ఆస్తులను ఏపీ సర్కారు సాధించుకుంటుందా.? అన్నది వేచి చూడాలి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్